Yoga Guru Ramdev : పతంజలి యాడ్స్ కేసు.. రామ్‌దేవ్ బాబా విచారణకు రావాల్సిందే.. సుప్రీంకోర్టు ఆదేశాలు!
Yoga Guru Ramdev : పతాంజలి సంస్థ యాడ్స్ ఇచ్చిందంటూ దాఖలైన పిటిషన్‌లో రాందేవ్ బాబా పైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది.

Yoga Guru Ramdev Summoned By Supreme Court Over Patanjali's Misleading Ads
Yoga Guru Ramdev : పతాంజలి సంస్థ కమర్షియల్ యాడ్స్ పైనా న్యాయవిచారణ కొనసాగుతోంది. అలోపతి మెడిసిన్స్‌ను తక్కువ చేస్తూ పతాంజలి సంస్థ యాడ్స్ ఇచ్చిందంటూ దాఖలైన పిటిషన్‌లో రాందేవ్ బాబా పైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. కోర్టు దిక్కరణ నోటీసులు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
Read Also : Rana Daggubati : బాలయ్య రికార్డులను బ్రేక్ చేయడానికి.. గట్టి ప్లాన్ వేస్తున్న రానా.. ఏంటో తెలుసా..!
ప్రముఖ కార్పొరేట్ వ్యాపారి, యోగా గురు రాందేవ్ బాబా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కుంటున్నారు. పతంజలి ఆయుర్వేద వస్తువుల యాడ్స్‌కు సంబంధించి.. కొన్నాళ్లుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో భాగంగా రాందేవ్ బాబా స్వయంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
పతంజలి యాడ్స్‌పై ఐఎంఎ తీవ్ర అభ్యంతరం :
పతంజలి యాడ్స్.. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేసేలా ఉన్నాయని.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేసు వేసింది. 2022 నుంచి సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తోంది. అన్ని రకాల వ్యాధుల నివారణకు పతంజలి ఆయుర్వేద మందులు పని చేస్తాయంటూ దేశవ్యాప్తంగా ప్రకటనలు వేశారు రాందేవ్ బాబా. ఆ యాడ్స్ పై ఐఎంఎ అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. వెంటనే ఆ యాడ్స్ నిలిపివేయాలని రాందేవ్ బాబాను ఆదేశించింది. పతంజలి సంస్థకు కోటి రూపాయల జరిమానా కూడా విధించింది సుప్రీంకోర్టు.
ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో పతంజలి సంస్థ కోర్టుకు హామీ ఇచ్చింది. కానీ అలాగే యాడ్స్ వేస్తున్నారని ఐఎంఎ తిరిగి కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రకటనల విషయంలో కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాలని పతంజలి సంస్థ అధినేత రాందేవ్ బాబా, సీఈవో బాలకృష్ణకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పతంజలి ఆయుర్వేదంపై వాణిజ్య ప్రకటనలు జారీ చేసినందుకు తాము జారీ చేసిన షోకాజ్ కంటెప్ట్ పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.