Yogi Adityanath: పిల్లల జోడీ అంటూ అఖిలేశ్ యాదవ్‌ను పోల్చిన యోగి ఆదిత్యనాథ్
యోగి ఆదిత్యనాథ్ ఎలక్షన్ స్పీచ్ లో భాగంగా అఖిలేశ్ యాదవ్ అతని మిత్రపక్షమైన జయంత్ చౌదరిని తిట్టిపోశారు. 2013 ముజఫర్ నగర్ అల్లర్లలో పాత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించారు యూపీ సీఎం.

Up Cm Yogi Adityanath
Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ ఎలక్షన్ స్పీచ్ లో భాగంగా అఖిలేశ్ యాదవ్ అతని మిత్రపక్షమైన జయంత్ చౌదరిని తిట్టిపోశారు. 2013 ముజఫర్ నగర్ అల్లర్లలో పాత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించారు యూపీ సీఎం.
‘ఈ ఇద్దరు పిల్లల జోడీ ఉంది కదా. 2014లో కలిశారు. 2017లో కూడా.. 2017లో వారి విలువ ఏంటో తెలిసేలా రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్పారు’ అని అన్నారు. అఖిలేశ్ యాదవ్, చౌదరి 2017 రాష్ట్ర ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
‘2013లో ముజఫర్ నగర్ అల్లర్లు జరిగినప్పుడు సచిన్, గౌరవ్ అనే ఇద్దరు వ్యక్తులను హతమార్చారు. ఆ ఇద్దరిలో ఒకరు లక్నోకు చెందిన వారు. అప్పుడు అధికారంలో ఉన్నవారే దానికి బాధ్యులు. ఈ ఘటనను ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ కూడా సమర్థిస్తున్నారు’ అని యోగి అన్నారు.
Read Also : ‘అఖండ’ అభిమానం.. ఆరగించిపోండి..
‘ఈ జోడీ తిరిగొచ్చింది. కాకపోతే ప్యాకేజి మాత్రమే కొత్తగా ఉంది’ అని యూపీ సీఎం విమర్శించారు.