UP Election : అఖిలేష్ యాదవ్ కి యోగి ఫోన్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్..సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కి ఫోన్ చేశారు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టీనా యాదవ్ బుధవారం కరోనా

UP Election : అఖిలేష్ యాదవ్ కి యోగి ఫోన్

Akilesh (1)

Updated On : December 23, 2021 / 3:40 PM IST

UP Election :  ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్..సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కి ఫోన్ చేశారు. అఖిలేష్ యాదవ్ భార్య

డింపుల్,కూతురు టీనా యాదవ్ బుధవారం కరోనా బారిన పడిన నేపథ్యంలో వారి ఆరోగ్య సమాచారం గురించి అఖిలేష్ కి ఫోన్ చేసి ఆరా తీశారు సీఎం యోగి ఆదిత్యానాథ్. కోవిడ్ బారిన పడిన అఖిలేష్ భార్య,కూతురు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

మరోవైపు, తనకు టెస్ట్ లలో కోవిడ్ నెగిటివ్ వచ్చినప్పటికీ…ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజులు ఐసొలేట్ అవుతున్నట్లు అఖిలేష్ యాదవ్ గురువారం సృష్టం చేశారు. ఈ మూడు రోజు తాను బహిరంగ కార్యక్రమాలకు హాజరుకాలేనని,వర్చువల్ గానే ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు అఖిలేష్ యాదవ్ తెలిపారు.

కాగా,వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ-ఎస్పీ ప్రచార హోరు మాటల తూటాలతో తారా స్థాయికి చేర్చాయి. ఉత్తరప్రదేశ్ లో బలపడేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా..ప్రధాన పోటీ ఎస్పీ-బీజేపీ మధ్యనే ఉండేట్లు ఇటీవల విడుదలైన కొన్ని సర్వేలు కూడా సృష్టం చేస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో యూపీని వదులుకోకూడదని నిర్ణయించుకున్న బీజేపీ..ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

సాక్ష్యాత్తూ ప్రధాని మోదీ కూడా ఇటీవల వరుస యూపీ పర్యటనలు చేస్తూ..ప్రధానంగా సమాజ్ వాదీ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో మోదీ..10సార్లు యూపీ సర్యటనకు వెళ్లడం విశేషం. ఇక,ఈ సారి ఎన్నికల ప్రచారంలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ కొంచెం వెనుకబడిందనే చెప్పాలి.

ALSO READ Covid Vaccination In India : దేశంలో 60 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి