ప్రాణాలు కాపాడిన హెల్మెట్ : ఎగిరిపడ్డా భలే బతికింది

ఢిల్లీ : భూమ్మీద నూకలుంటే ఎటువంటి ప్రమాదం సంభవించినా ప్రాణాలతో బైటపడవచ్చు అనే ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సోమవారం (ఫిబ్రవరి 18న) సప్నా అనే విద్యార్థిని తన ఇద్దరు స్నేహితులు కునాల్, జియాలతో కలిసి బైకు మీద ప్రయాణిస్తోంది. కునాల్ బైక్ నడుపుతుండగా, అతడి వెనుక జియా, ఆమె వెనుక సప్నా కూర్చుంది. మరో ఫ్రెండ్‌ను కలిసేందుకు వీరు పశ్చిమ విహార్ నుంచి జనక్‌పురి వెళ్తున్నారు. వికాస్‌పురి ఫ్లై ఓవర్ వద్దకు రాగానే వీరి బైకును మరో బైక్ ఢీకొట్టింది. దీంతో బైకు అదుపుతప్పి ఫ్లై ఓవర్‌ను ఢీకొంది. కునాల్, జియా అక్కడే కిందపడిపోగా.. వారికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ వెనకాల కూర్చున్న సప్నా మాత్రం ఫ్లై ఓవర్ పైనుంచి కింద రోడ్డు మీద పడిపోయింది. ఏ మాత్రం తేడా జరిగినా… ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడిపోయేదే కానీ… ఆ పక్కనే ఓ కారుకు తగిలి పడిపోవటంతో చిన్న చిన్న గాయాలైనా ప్రాణాలతో బైటపడింది.
అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఏ వాహనం రాకపోవడంతో సప్నాకు మరో ప్రమాదం తప్పింది. అయితే హెల్మెట్ ధరించడం వల్ల సప్నాకు ప్రాణాపాయం తప్పిందనిపోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై వికాస్‌పురి పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆమెకు భూమి మీద ఇంకా నూకలున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Delhi: Woman on bike thrown off flyover, survives pic.twitter.com/QcQLlKXFet
— TOI Delhi (@TOIDelhi) February 19, 2019
Read Also : ఆపరేషన్ కోబ్రా : నోటుకు ట్వీట్లు వేస్తున్న సినిమా వాళ్లు
Read Also : డెవలపర్లకు గుడ్ న్యూస్: గూగుల్ కొత్త వెబ్ డొమైన్ వచ్చేసింది