Kerala Nurse : రాహుల్ గాంధీ నా బిడ్డే..కేరళ నర్సు భావోద్వేగం..వీడియో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ రాష్ట్రంలోని వయనాడ్ కి వెళ్లిన విషయం తెలిసిందే.

Kerala (1)
Kerala Nurse కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ రాష్ట్రంలోని వయనాడ్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం వయానడ్ లో రాహుల్ గాంధీని చూసిన కేరళకు చెందిన నర్సు రాజమ్మ వవతిల్ భావోద్వేగానికి గురైంది. నర్సుని చూసిన రాహుల్ కారు ఆపి ఆమెతో మాట్లాడారు.
ఈ సమయంలో నర్సు వవతిల్…రాజమ్మ రాహుల్ నా కొడుకులాంటివారు.. నా కళ్ల ముందే పుట్టారు.. మీ అందరికంటే ముందే నేను ఈయనని చూశాను అంటూ రాహుల్ భద్రతా సిబ్బందికి చెబుతూ సంతోషపడ్డారు. అమ్మా,చెల్లి ఎలా ఉన్నారంటూ రాహుల్ ని కుశల ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా రాహుల్ కి ఓ స్వీటు బాక్సు కూడా ఇచ్చారు రాజమ్మ వవతిల్. ఆ తర్వాత మీకు అసౌకర్యం కలిగించినందుకు క్షమించాలని అని అనగా..అలాంటిదేమీ లేదంటూ రాహుల్ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.
మా ఇంటి నుంచి చాలా తెచ్చి ఇద్దామనుకున్నాను కానీ, నీకు సమయం లేదు. ఆ విషయం నేను అర్ధం చేసుకోగలను అంటూ రాహుల్‌తో చెబుతూ మురిసిపోయింది నర్సు రాజమ్మ. ఇందుకు ప్రతిగా రాహుల్ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. భగవంతుడు నీకు మేలు చేయాలంటూ రాహుల్‌ను రాజమ్మ ఆశీర్విదించింది. ఈ వీడియోను కేరళ కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాహుల్ తన కారులో కూర్చొని ఉండగా ఆయనకు అభినందలు తెలుపుతూ నర్సు రాజమ్మ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కేరళకు చెందిన రాజమ్మ వవతిల్…50 ఏళ్ల క్రితం ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో నర్సుగా పనిచేసేవారు. 1970 జూన్ 19న హాస్పిటల్ లో రాహుల్ గాంధీ పుట్టగానే ఆ పసిగుడ్డును చేతుల్లో ఎత్తుకుని ముసిరిపోయిన నర్సు రాజమ్మనే. రాజమ్మ 1987లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కేరళ తిరిగి వచ్చేసింది.
The wholesome love and affection from Rajamma Amma who was a nurse at Delhi’s holy family hospital where
Shri @RahulGandhi was born. pic.twitter.com/fMCDNIsUio— Congress Kerala (@INCKerala) August 17, 2021