ఎయిర్‌పోర్టుకు ట్రైన్ టిక్కెట్ కేవలం రూ.10 మాత్రమే

ఎయిర్‌పోర్టుకు ట్రైన్ టిక్కెట్ కేవలం రూ.10 మాత్రమే

Updated On : January 7, 2021 / 5:29 PM IST

Kempegowda Airport: సాధారణంగా సిటీ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ వెళ్లాలంటే వేలల్లో ఖర్చు పెట్టాలి. లేదంటే కనీసం వందల్లో అయినా వెచ్చించాల్సిందే. ఆర్టీసీ బస్ ఎక్కినా.. రూ.200నుంచి రూ.300వరకూ అవుతుంది. అయితే బెంగళూరు కమ్యూటేటర్స్ కు రిలీఫ్ ఇచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ స్పెషల్ ట్రైన్ సర్వీస్ స్టార్ట్ చేసింది. బెంగళూరు నుంచి కెంపెగౌడ ఎయిర్‌పోర్టు వరకూ వెళ్లేందుకు ట్రైన్ ఏర్పాటు చేసింది.

సౌత్ వెస్టరన్ రైల్వే దేవనహల్లి స్టేషన్ వరకూ సర్వీస్ మొదలుపెట్టింది. రోడ్ రహిత్, ఫాస్ట్, ఖరీదైన కొత్త సర్వీసును ప్రొవైడ్ చేస్తుంది. సిటీ నుంచి ఎవరైనా ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి అక్కడకు చేరుకోవడంతో పాటు కేవలం రూ.10 నుంచి రూ.15ఛార్జితో ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోవచ్చు.

ఇలా చేయడం బాగుంది. దాంతో పాటు ట్రైన్స్ సరైన సమయానికి వస్తే ఫ్లైట్ మిస్ అవకుండా ఉంటాం. అలా చేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే సరైన సమయానికి అక్కడికి చేరుకోగలం అని ఓ ప్రయాణికుడు చెప్తున్నాడు.

ఇప్పుడు చాలా మంది ట్రైన్ సర్వీసునే నమ్ముకుంటున్నారు. బెంగళూరులోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు వీటినే ఎంచుకుంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్లేవారిలో 20శాతం మంది ట్రైన్స్ కు మారితే ట్రాఫిక్ బెడద కాస్త తగ్గిపోయినట్లే. దీనిపై సీఎం బీఎస్ యడ్యూరప్ప కూడా ట్వీట్ చేశారు.

‘సోమవారం నుంచి బెంగళూరు వాసులు కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకూ ట్రైన్ లో వెళ్లొచ్చు’ అని ట్వీట్ చేశారు. మరికొద్ది నెలల్లో ఈ రూట్ లో ఐదు రైళ్ల వరకూ నడపాలని అనుకుంటున్నారు. అది కూడా కేవలం రూ.10 ధరకే.