Supreme Court :‘నువ్వు వీరుడివే కావొచ్చు..కానీ అగ్నివీరుడివి కాదు’ సుప్రీంకోర్టు జడ్జి-లాయర్ మధ్యఆసక్తికర సంభాషణ
రక్షణ శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ గురించి దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయవాది శ్రీ శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అగ్నిపథ్ పథకం పిల్ ను అడ్వకేట్ శర్మ దాఖలు చేశారు. ఈ పిల్ పై తీవ్ర వాదనలు జరగుతున్న సమయంలో జస్టిస్ డీవై చంద్రచూడ న్యాయవాది శ్రీ శర్మను ఉద్దేశించి ఓ జోక్ వేశారు. ‘

Supreme Court Justice Dy Chandrachud Advocate Sharma
Supreme Court Justice DY Chandrachud-advocate Sharma : రక్షణ శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ గురించి దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయవాది శ్రీ శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అగ్నిపథ్ పథకం పిల్ ను అడ్వకేట్ శర్మ దాఖలు చేశారు. ఈ పిల్ పై తీవ్ర వాదనలు జరగుతున్న సమయంలో జస్టిస్ డీవై చంద్రచూడ న్యాయవాది శ్రీ శర్మను ఉద్దేశించి ఓ జోక్ వేశారు. ‘‘మీరు వీరుడే కావొచ్చు, కానీ అగ్నివీరుడు మాత్రం కాదు’ అంటూ చమత్కరించారు. న్యాయమూర్తి చమత్కారానికి కోర్టు హాల్‌లో నవ్వులు విరబూశాయి.
సుప్రీంలో పిల్‌లు దాఖలు చేయడంలో న్యాయవాది శర్మ పాపులర్. పలు కీలక అంశాలపై శర్మ ఎప్పుడూ పిల్ దాఖలుచేస్తుంటారు. ఈక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ కామెంట్ తర్వాత అడ్వకేట్ శర్మ ఇదే విషయాన్ని గుర్తు చేశారు. తన కష్టాన్ని జస్టిస్ చంద్రచూడ్ గుర్తించి ఆ కామెంట్ చేశారని శర్మ చాలా సరదాగా అన్నారు. అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ తొలి పిల్ దాఖలు చేసింది నేనే అని..అందుకే జస్టిస్ చంద్రచూడ్ తనను అలా అని ఉంటారని శర్మ అన్నారు.
కాగా అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై న్యాయవాదులు శర్మ, హర్ష్ అజయ్ సింగ్, రవీంద్ర సింగ్ షెకావత్‌లు దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లను కోర్టు విచారించింది.