Uttar Pradesh : రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. రైలు పట్టాల వద్ద రీల్స్ చేస్తుండగా ఢీకొట్టిన ట్రైన్, యువకుడు మృతి
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

train hit young man
Uttar Pradesh – Young Man Died : సెల్ఫీ, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఈనేపథ్యంలో చాలా మంది రీల్స్ చేస్తూ గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నారు. ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో సాహసాలకు కూడా వెనకాడట్లేదు. రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
తాజాగా ఓ యువకుడు కూడా రీల్స్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ బారబంకి ప్రాంతానికి చెందిన ఫర్మాన్ అనే 14 ఏళ్ల యువకుడు ఇన్ స్టా రీల్స్ కోసం పెద్ద సాహసం చేశాడు. ఏకంగా రైలు వచ్చే సమయంలో దాని ముందు పట్టాల వద్ద రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ రైలు యువకుడిని ఢీకొట్టింది. దీంతో ఫర్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
జహన్ గీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
tw // disturbing
Barabanki: A teenager Farmaan (14) who was purportedly making a video for Instagram reels along the railway tracks was kiIIed when he was struck by a running train. pic.twitter.com/Ysxl895ABD
— زماں (@Delhiite_) September 30, 2023