West Bengal : రద్దీగా ఉన్న రైలులో యువతి డ్యాన్స్.. ఈ ట్రెండ్ ఆపండి అంటూ నెటిజన్లు ఫైర్

మెట్రోలు, స్టేషన్లలో రీల్స్ చేయడం ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా వెస్ట్ బెంగాల్‌లో ఓ యువతి రద్దీగా ఉన్న రైలులో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. రీల్స్ చేయడం నిషేధించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

West Bengal : రద్దీగా ఉన్న రైలులో యువతి డ్యాన్స్.. ఈ ట్రెండ్ ఆపండి అంటూ నెటిజన్లు ఫైర్

West Bengal

West Bengal : రద్దీగా ఉన్న ట్రైన్‌లో ఓ యువతి భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మెట్రోలు, రైల్వే స్టేషన్లలో ఇలా రీల్స్ చేయడాన్ని నిషేధించాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Bihar: 15 ఏళ్లుగా పాఠాలు చెప్తున్న నకిలీ టీచర్లు.. ఇలా ఎలా సాధ్యమైందంటే?

ఇటీవల కాలంలో మెట్రో రైళ్లు, రైల్వే ప్లాట్ ఫారమ్‌లపై బహిరంగ ప్రదేశాల్లో జనం డ్యాన్సులు చేసి ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఈ చర్యలు ప్రజలకు చికాకు తెప్పించడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో రద్దీగా ఉన్న రైలు కోచ్‌లో ఓ యువతి భోజ్ పురి పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది.

వీడియోలో ఉన్నది కోల్‌కతాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన సహేలీ రుద్రగా తెలుస్తోంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీడియోలో ఆమె షర్ట్‌తో పాటు చిరిగిన జీన్స్ వేసుకుంది. ప్రయాణికులతో క్రిక్కిరిసిన సీట్ల మధ్యకు వేగంగా వస్తూ ఖేసరీ లాల్ యాదవ్ ‘సాజ్ కే సవార్ కే’ పాటకి చాలా కాన్ఫిడెన్స్‌తో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఉత్సాహంగా ఆమె చేస్తున్న డ్యాన్స్‌ను కొందరు ప్రయాణికులు వీడియో తీయడం కనిపించింది. కొందరు మాత్రం ఈ హంగామాను అస్సలు పట్టించుకోలేదు.

Wife Swapping : ఛీ..ఛీ.. మరీ ఇంత నీచమా? ఏకంగా భార్యలను మార్చుకుని ఎంజాయ్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే

సహేలీ రుద్ర ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. దానికి ‘చలో హమ్ వి బనా లియే’ అనే క్యాప్షన్ యాడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి సంఘటనలు విసుగు తెప్పిస్తున్నాయని చాలామంది నెటిజన్లు మండిపడ్డారు. అసలు చాలామంది రైళ్లలో డ్యాన్స్ వీడియోలు ఎందుకు షూట్ చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. లోకల్ రైళ్లు, స్టేషన్లలో రీల్స్ చేయడం నిషేధించాలని కోరుతున్నారు. ఇలాంటి వీడియోలు బయటకు వచ్చిన ప్రతిసారి ప్రయాణికులు గగ్గోలు పెట్టడం అధికారులు నామ మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. వీటిపై కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.