దీదీ చెంపదెబ్బే నాకు ఆశీర్వాదం : మోడీ 

  • Published By: veegamteam ,Published On : May 9, 2019 / 11:02 AM IST
దీదీ చెంపదెబ్బే నాకు ఆశీర్వాదం : మోడీ 

Updated On : May 9, 2019 / 11:02 AM IST

బెంగాల్‌లోని పురులియాలో  గురువారం (మే 9,  2019) మోడీ ఓ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్ర‌ధానిని చెంప‌దెబ్బ కొట్టాల‌ని ఉంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారనీ ఆ విషయాన్ని బెంగాలీలు తనకు చెప్పారన్నారు. దీదీని తాను ఓ సోదరిలా భావిస్తున్నాని ప్రధాని పేర్కొన్నారు.

దీదీ తనను  కొట్టే చెంప‌దెబ్బ అది నాకు దీవెనగా మారుతుంద‌ని ఆయన అన్నారు. మీరు చెంప చెళ్లుమ‌నిపించినా తాను అంగీక‌రిస్తాన‌ని.. దాని క‌ంటే ముందు పేద‌ల‌ను మోసం చేసిన చిట్‌ఫండ్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంద‌ని మోడీ మమతాకు చురకలు అంటించారు. 

మ‌మతా బెన‌ర్జీకి చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె అహంకారానికి నిదర్శనమని మోడీ అన్నారు. ప్ర‌ధానితో మాట్లాడేందుకు మమతా నిరాక‌రిస్తున్న‌ారు అంటే ఆమె ప‌త‌నం ప్రారంభ‌మైన‌ట్లే అని మోడీ విమర్శించారు.