odisha : డాక్టర్ సార్..ఇదే పాము కాటేసింది..మందు ఇవ్వండి అంటూ ఆసుపత్రికి వచ్చిన యువకుడు

డాక్టర్ సార్..ఇదే పాము కాటేసింది. మందు ఇవ్వండి..అంటూ ఓ యువకుడు ఆసుపత్రికి వచ్చాడు.

odisha : డాక్టర్ సార్..ఇదే పాము కాటేసింది..మందు ఇవ్వండి అంటూ ఆసుపత్రికి వచ్చిన యువకుడు

Doctor

Updated On : March 25, 2021 / 2:51 PM IST

Youth Carries Snake : డాక్టర్ సార్..ఇదే పాము కాటేసింది. మందు ఇవ్వండి..అంటూ ఓ యువకుడు ఆసుపత్రికి వచ్చాడు. దాదాపు ఆరు అడుగుల నాగు పామును చూసిన డాక్టర్లు, అక్కడున్న వారు షాక్ కు గురయ్యారు. కొందరు భయంతో బయటక పరుగులు తీశారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని నవరంగ పూర్ ఉమ్మరకోట్ సామాజిక ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఝోరింగా యువి 51 (ఉమ్మర్ కోట్ విలేజ్ 51) చోటాగుడ గ్రామానికి చెందిన సుధాంశు సీల్ (35) అనే యువకుడు బుధవారం పొలంలో పనిచేస్తున్నాడు.

ఈ సమయంలో ఓ నాగుపాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అమాంతం..సుధాంశు కాలి మీద కాటేసింది. పాము కాటుకు చలించని అతను ఒక్క ఉదుటున దానిని పట్టుకున్నాడు. ఒక చేతితో పాము తల పట్టుకుని…మోటార్ బైక్ పై ఉమ్మరకోట్ సామాజిక హాస్పిటల్ కు చేరుకున్నాడు. ఆరు అడుగులు ఉన్న నాగుపామును చేతితో పట్టుకుని..డాక్టర్ ను కలిశాడు. ఇది చూసిన డాక్టర్లు, రోగులు, వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పామును ఓ సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. బాధితుడికి డాక్టర్ ప్రాథమిక చికిత్స చేశారు. అయితే..నాగుపాము కాటేసినా..సుధాంశు చలించక పోవడం, కాటు వేసి కొన్ని గంటలైనా…ఏమి కాకపోవడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు.