Rare Wild Cat : ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన పిల్లి

ఎవరెస్టు శిఖరం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ శిఖరానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన అడవి పిల్లి జాతిని జంతు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Rare Wild Cat : ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన పిల్లి

CAT

Updated On : January 29, 2023 / 12:52 PM IST

Rare Wild Cat : ఎవరెస్టు శిఖరం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ శిఖరానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన అడవి పిల్లి జాతిని జంతు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పల్లాస్ క్యాట్స్ గా పిలవడే ఈ అడవి పిల్లుల ఉనికి ఎవరెస్టు శిఖరంపై కనిపించడం ఇదే తొలిపారి అని పేర్కొన్నారు. సాధారణంగా గ్రామల్లో కనిపించే పిల్లుల కంటే అడవి పిల్లులు కొంచెం పెద్దగా, బలంగా కనిపిస్తాయి. అయితే పల్లాస్ క్యాట్స్ కూడా అడవి పిల్లులే కానీ అవి గ్రామాల్లో పిల్లుల కంటే కూడా చిన్నవిగా ఉంటాయి.

ఈ పల్లాస్ క్యాట్స్ నే మనూల్ లు అని కూడా పిలుస్తారు. ఈ పిల్లులను భూమిపైనే తొలిసారిగా 1776లో బైకాల్ సరస్సు పరిసరాల్లో పీటర్ సైమన్ పల్లాస్ అనే జంతు శాస్త్రవేత్త గుర్తించడం వల్ల వీటికి పల్లాస్ క్యాట్స్ అనే పేరు వచ్చింది. అవి పరిసరాలను బట్టి గ్రే, బూడిత, బూడిత ఎరుపు రంగుల్లో ఉంటాయి.  తలకు ఇరువైపుల చెవులు పొట్టిగా, గుండ్రంగా ఉంటాయి. తోక 20 నుంచి 30 సెం.మీ పొడవులో ఉంటుంది.

Most Expensive Pet : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే!

ఈ జాతి పిల్లుల కాళ్లు పొట్టిగా ఉంటాయి. వీటి శరీరంపై పొడవాటి వెంట్రుకలు ఉంటాయి. అయితే వీపు భాగంలో ఉండే వెంట్రుకల కంటే ఉదర భాగంలో ఉండే వెంట్రుకలు చల్లటి ప్రదేశాల్లో నివసించే ఈ పిల్లులను చలి తీవ్రత నుంచి కాపాడేందుకు ఈ పొడవాటి వెంట్రుకలు తోడ్పడుతాయి. ఇవి ఎక్కువగా హిమాలయాలు, టిబెట్ పీఠభూమి, ఇరానియన్ పీఠభూమి, దక్షిణ సైబీరియన్ కొండలు తదితర ప్రాంతాల్లో కనిపిస్తాయి.