Ganesh Chaturthi 2023 : రూ.2.5 కోట్లు విలువైన నాణాలతో వినాయకుడికి అలంకరణ

ఏ రూపంలో అయినా ఇట్లే ఒదిగిపోయే గణనాధుడు విభిన్న ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాడు. పువ్వులు, రుద్రాక్షలు, కరెన్సీలలో ఒదిగిపోయిన లంబోదరుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. కోట్ల రూపాయల కరెన్సీలో కొలువైన గణనాధుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.

Ganesh Chaturthi 2023 : రూ.2.5 కోట్లు విలువైన నాణాలతో వినాయకుడికి అలంకరణ

Ganapathi with currency notes and coins

Ganesh Chaturthi 2023  coins Ganesh : వినాయక చవితి వచ్చిందంటే విభిన్న ఆకృతులతో గణనాధులు కొలువుతీరతారు. పుష్పాలు, కరెన్సీలు, డ్రైఫ్రూట్స్, పండ్లు, రుద్రాక్షలు, సుగంధ ద్రవ్యాలు,కూరగాయాలు ఇలా ఎన్నో రకాలుగా వినాయకుడిని తీర్చి దిద్ది పూజలు చేస్తారు. వినాయక చవితి వచ్చిదంటే చాలు వినూత్న ఆకారాల్లో కొలువైన వినాయకులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. అటువంటి ఓ వినూత్న గణనాధులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంటారు.

అదిగో అటువంటి వినాయకుడే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. గణేశ్ చతుర్ధతి సందర్భంగా బెంగళూరు(Bengaluru)లోని జేపీ నగర్ లో సత్యగణపతి ఆలయం(Sri Sathya Ganapathi Temple)లో రూ.2.5 కోట్ల విలువైన నాణాలతో వినాయకుడిని అలంకరించారు. సోమవారం (సెప్టెంబర్ 18,2023) వినాయక చవితి పండుగ సందర్భంగా కర్ణాటకలో గణేషుడు వేడుకలతో అంగరంగ వైభోగంగా కోలాహలం నెలకొంది. దేవాలయాలకు భక్తులు పోటెత్తారు.

Ganesh Temple : రూ.65 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో గణేష్ ఆలయ అలంకరణ

దీంట్లో భాగంగా బెంగళూరులోని జేపీ నగర్ లోని శ్రీ గణపతి షిర్డీ సాయి ట్రాస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దేవాలయంలో రూ.5, 10, 20 రూపాయల నాణేలతో పాటు 10, 20, 50, 100, 200, 500 రూపాయిల నోటులతో గణపతిని అలంకరించారు. వీటి విలువ మొత్తం 2.5 కోట్లు కావటం విశేషం. 150మంది భక్తులు నాణాలతో లంబోధురుడ్ని నాణాలతో అలంకరించారు. దీంతో వినాయకుడు విగ్రహ భద్రత కోసం సీసీ కెమెరాలను అమర్చారు.