Anand Mahindra : ఇలాంటి అద్భుతాన్ని భారత్‌లో చేయగలమా? : మంత్రి గడ్కరికీ ఆనంద్ మహీంద్రా ప్రశ్న
గడ్కరీ జీ మనం కూడా ఇలాంటి అద్భుతాన్ని భారత్ లో చేయగలమా? అంటూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది.

Netherlands Rivers Bridge Anand Mahindra
Netherlands Rivers Bridge..Anand Mahindra : ఇంట్రెస్టింగ్ ఫోటోలు, వీడియోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)మరో అద్భుతమైన వీడియోతో మనముందుకొచ్చారు. ఓ అత్యాధునిక బ్రిడజ్ నిర్మాణం గురించి కేంద్ర మంత్రి నితిన్ గట్కరి (Minister Nitin Gadkari)కి దృష్టికి తీసుకెళుతు ‘‘ఇటువంటి అద్భుతాన్ని మన భారత్ లో కూడా చేయగలమా?’’ అంటూ ప్రశ్నించారు.
నెదర్లాండ్స్ లోని రివర్స్ బ్రిడ్జి ( Netherlands Rivers Bridge )గా పేరొందిన వెలువెమీర్ అక్వెడక్ట్ బ్రిడ్జ్ వీడియో ను ఆనంద్ మహీంద్రా తన ట్వట్టర్ లో షేర్ చేశారు. దీంటో నదిపై నిర్మించిన రహదారిపై వాహనాలు స్పీడ్ గా దూసుకుపోతున్నాయి. అలా వాహనాలు దూసుకుపోతుండగా మధ్యలో రహదారి కట్ అయి ఉంటుంది. నది నీరు కనిపిస్తుంటుంది. అయినా కార్లు మాత్రం రయ్ మంటూ దూసుకుపోతుంటాయి. మధ్యలో అవి కాస్త కనిపించకుండా తిరిగి రహదారిపై కనిపిస్తాయి. అలా ఆగకుండా అవి వెళ్లిపోతుంటాయి. కానీ కాసేపు కనిపించకపోయేసరికి అవి ఏమయ్యాయా? నీటిలోకి గానీ వెళ్లిపోయాయా? అనికునేంతలో మళ్లీ కనిపిస్తాయి. అదే స్పీడ్ తో దూసుకుపోతు..
రహదారి మధ్యలో నీరు వెళ్లేందుకు వీలుగా రహదారిని బ్రేక్ చేసి ఉండడం కనిపిస్తుంది. అలా బ్రేక్ చేసినప్పటికీ వాహనాలు ఆగకుండా దూసుకుపోతుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. అలా కట్ అయ్యే చోట రోడ్డు నీటి కింద నుంచి వెళ్లేలా డిజైన్ చేశారు. అదీ అద్భుతంగా..చూడటానికి ఇంత బాగుంటే ఇక అలా మధ్యలో బుడుంగున నీటి కిందను వెళితే ఎంతబాగుంటుందో కదా అనిపిస్తుంది. అది ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభ అంటే అనేలా ఉందీ నిర్మాణం. వాహనాలు వెళ్లటానికి వీలుగా అదే సమయంలో బోట్లు వెళ్లటానికి చక్కటి సౌకర్యంగా ఉండే ఈ నిర్మాణం నిజంగా అద్భుతంగా ఉంది.
నీటిపై బోట్లు వెళ్లడానికి రహదారి మధ్యలో ఈ డిజైన్ చేశారు. అక్కడ రహదారి నీటి కింది భాగం నుంచి వెళుతుంది. వాహనాలు వేగంగా వెళుతూ, మధ్యలో కాసేపు కనిపించకుండా తిరిగి మరోవైపు ప్రత్యక్షమవుతున్నట్టు కనిపించటం భలే గమ్మత్తుగా ఉంది. ఈ నిర్మాణం చూసిన ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఫిదా అయిపోయారు. భారత్ (india) లోనూ ఇలాంటి నిర్మాణాలు చేయగలమా? అంటూ ఆనంద్ మహీంద్రా కేంద్ర మంత్రి గడ్కరీని ప్రశ్నించారు. నెదర్లాండ్స్ లోని హార్డర్ విక్ పట్టణ సమీపంలో ఈ బ్రిడ్జిని 2002లో ప్రారంభించిన ఈ నిర్మాణం నిజంగా చాలా అద్భుతంగా ఉంది..ఆనంద్ మహీంద్రా ట్వీట్ ను లక్షలాదిమంది వీక్షించారు. మరి మీరుకూడా ఓ లుక్కేయండీ ఈ అమేజింగ్ బ్రిడ్జ్ టెక్నాలజీని..
Wait…What?? Can we do this too, @nitin_gadkari ji? ? pic.twitter.com/SNjRry5rup
— anand mahindra (@anandmahindra) June 12, 2023