Amazing Necklace : వారెవ్వా..ఏం ఐడియా గురూ..! రూపాయి ఖర్చు లేకుండా ప్రియురాలిని ఫిదా చేశావే..

రూపాయి ఖర్చు లేకుండా ప్రియురాలిని ఫిదా చేశాడో యువకుడు. తన సృజనాత్మకతతో ప్రియురాలి మెడను వజ్రాల మెరుపులు కూడా సాటిరాని వెలుగులతో నింపేశాడు.ఇతగాడి ఐడియాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Amazing Necklace :  వారెవ్వా..ఏం ఐడియా గురూ..! రూపాయి ఖర్చు లేకుండా ప్రియురాలిని ఫిదా చేశావే..

Amezing Nnecklace

Updated On : March 3, 2023 / 5:32 PM IST

Amazing Necklace : ప్రియురాలు సంతోషపడాలంటే బుగ్గమీద ఓ తీపి ముద్దు పెట్టాలంటే వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా? ఖరీదైన బహుమతులు ఇవ్వాలా? అదేనా ప్రేమంటే? మనస్సుండాలే కాని..ప్రేమించే మనసుండాలే కానీ ఓ చిన్న కవితతో ప్రియురాలి మనస్సు గెలుచుకోవచ్చు..కానీ ఓ ప్రియుడు మాత్రం ఓ చిన్న కాగితం ముక్కతో వజ్రాల మెరుపులు మెరిపించి ప్రియురాలి మనస్సు గెలుచుకున్నాడు. వారెవ్వా ఏమి అద్భుతం అంటూ ఆ ప్రియురాలు తెగ సంతోషపడేలా చేశాడు. ఇదో అద్భుతం.. అనిపించేలా ప్రియురాలికి ఎవ్వరూ ఊహించని బహుమతి ఇచ్చాడు.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన జాంగ్ తన ప్రేయసికి వెలుతురులో ప్రతిబింబించేలా కనిపించే అందమైన డిజైన్‌తో కూడిన నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఈ నెక్లెస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఛమ్మక్ మెరుపులు వెదజల్లుతోంది. తెల్ల కాగితాన్ని పెట్టెలో పెట్టి తన ప్రేయసికి బహుమతిగా ఇచ్చాడు. హా..ఏమో అనుకున్నాం ఉత్త తెల్లకాగితానికేనా గొప్ప బహుమతి అనటం అని ఊరికే తీసిపారేయకండీ..అక్కడే అతని సృజనాత్మకత అంతా..!!

తెల్ల కాగితాన్ని పెట్టెలో పెట్టి తన ప్రేయసికి ఇచ్చి..ఆ తరువాత అతను ఆమెను బయట సూర్యకాంతిలోకి తీసుకువెళ్లాడు. అంతే ఆమె మెడ మెరుపులో మెరిసిపోయింది. తెల్ల కాగితం ప్రతిబింబం ద్వారా ఫంక్షనల్‌గా రూపొందించిన నెక్లెస్‌ డిజైన్‌ సరిగ్గా ఆమె మెడలో ఒదిగేపోయే విధంగా సెట్‌ చేశాడు. ఇక చూడాలి వజ్రాల వెలుగులకు కూడా సాటిలేని వెలుగులతో ఆమె మెడ వెలిగిపోయింది. తన ప్రియురాలికి నెక్లెస్ తయారు చేసేందుకు ఈ చైనీస్ వ్యక్తి స్టెన్సిలింగ్, లైట్ ఉపయోగించాడు.

తెల్లటి షీట్‌పై అందమైన ఈ లైట్ రిఫ్లెక్టివ్ నెక్లెస్‌ని డిజైన్ చేయడానికి రెండు రోజుల సమయం పట్టిందని చెప్పుకొచ్చాడీ ప్రియుడు. డౌయిన్‌లో జాంగ్ అప్‌లోడ్ చేసిన నెక్లెస్ వీడియోకు మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చాయి. వేలాది కామెంట్స్ తో అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఏం ఐడియా గురూ..! పైసా ఖర్చు లేకుండా ప్రియురాలిని ఫిదా చేసేందుకు భలే ట్రిక్‌ ప్లే చేశావే అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. భలే థ్రిల్లింగ్ నెక్లెస్ అంటున్నారు.