Diwali 2023 : దీపావళి రోజు చేపల కూర నైవేద్యంగా పెట్టే వింత ఆచారం
భారతదేశం విభిన్న మతాలు కలయిక. దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో కూడా భిన్నత్వం కనిపిస్తుంది. హిందూ పండుగల్లో దేవుళ్లకు పెట్టే నైవేద్యాల్లోను..ఎన్నో భిన్నత్వాలు కలిగి ఉండటం భారతదేశంలోని ప్రత్యేకత.
strange celebration in Diwali : భారతదేశం విభిన్న మతాలు కలయిక. దేశ్ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో కూడా భిన్నత్వం కనిపిస్తుంది. హిందూ పండుగల్లో ప్రధానంగా దసరా, దీపావళి పండుగలు జరుపుకునే వేడుకల్లోను..అమ్మవార్లకు పెట్టే నైవేద్యాల్లోను..ఎన్నో భిన్నత్వాలు కలిగి ఉండటం భారతదేశంలోని ప్రత్యేకత అని చెప్పుకోవాలి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆచరించే వింత వింత ఆచారాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పండుగలు అంటే నీచు మాంసాలను దరిచేరనివ్వరు. మరీ ముఖ్యంగా దీపావళి పండుగ అంటే ఉత్తరాది భారతీయులు లక్ష్మీపూజను అత్యంత ఘనంగా చేసుకుంటారు. దీపావళి పండుగను ఐదు రోజులపాటు జరుపుకుంటారు. లక్ష్మీదేవి సంపదకు, శ్రేయస్సుకు అధిదేవతగా భావించి భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతారు.
Jest born Babies : చంటిబిడ్డలు ఏడ్చినా కన్నీళ్లు రావు ఎందుకో తెలుసా..? వెరీ ఇంట్రస్టింగ్
ఇఒక తూర్పు భారతంలోని పశ్చిమ బెంగాల్ లో కూడా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. బెంగాలీలు అంటే మత్య్సప్రియులు అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. బెంగాలీయులు చేపల్ని చాలా ఇష్టంగా తింటారు. అలాగే బెంగల్ అంటే కలకత్తా కాళీమాత గుర్తుకొస్తుంది. దసరా వచ్చినా దీపావళి పండుగ వచ్చినా బెంగాలీయులు కాళీకామాతను ఘనంగా పూజిస్తారు. రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కాళికా దేవి అంటే శక్తిగల తల్లి. శక్తినిచ్చే మాతకు రకరకాల నైవేద్యాలు సమర్పించే బెంగాలీయులు మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి కాళీమాత ముందు ఉంచుతారు.
Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరి దీపం .. నవగ్రహ దోషాల హరణం
దీపావళి రోజు కాళికాదేవికి స్వీట్లతోపాటు అన్నాన్ని కూడా వండి నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు ఈ అన్నమంతో పాటు పప్పు..చేపల కూరను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే దీపావళి రోజున బెంగాలీయులు దీపాలు పెట్టే విషయంలో కూడా చాలా ప్రత్యేకతను చూపిస్తుంటారు. ప్రతీ ఇంటి ముందు ఓలెక్క ప్రకారం దీపాలు వెలిగిస్తారు. ప్రతి ఇంటి ముందు 14 దీపాలను వెలిగిస్తారు. అలా చేస్తే దుష్టశక్తిలు దరిచేరవని నమ్ముతారు. నరదిష్టి తగలకుండా ఉంటుందని భావిస్తారు.