Uttar Pradesh : నీ భార్యకంటే నేనే బెటర్, నా కుక్కకు మాస్క్ వెయ్యను : లిఫ్టులో మహిళ రచ్చ
లిప్టు లో కుక్క..దాని మెడలో ఓ మాస్క్.. అంతలో వచ్చారు భార్యా భర్తలు. కుక్క గురించి జరిగింది పెద్ద గొడవ..ఈ గొడవకాస్తా సోషల్ మీడియాకెక్కింది.

Uttar Pradesh dog Issue in Lift
Uttar Pradesh dog Issue in Lift : భార్య భర్తలతో గొడవ పడిన ఓ మహిళ నీ భార్య కంటేనే నేనే బెటర్ అంటూ లిప్టులో నానా రచ్చా చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ తన తన పెంపుడు కుక్కను తీసుకుని లిఫ్ట్ ఎక్కింది. అదే సమయంలో భార్యాభర్తలు ఇద్దరు లిఫ్ట్ ఎక్కటానికి వచ్చారు. లిప్టులో కుక్క ఉండటం చూసిన ఆ వ్యక్తి నా భార్య గర్భవతి మీ కుక్క కరుస్తుందేమో దానికి మాస్క్ వేయండీ అని సూచించాడు. కానీ కుక్క యజమాని అంతెత్తున మండిపడింది. కుక్కకు మాస్క్ వేయనని చెప్పింది.
Flies problem in Village : ద్యావుడా..! ఈగల వల్లే ఆ ఊర్లో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావటంలేదట.!!
దానికి అతను నా భార్య గర్భిణి నీ కుక్క కరిస్తే మేమే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మాస్క్ వేయండి అని చెప్పాడు.దానికి ఆమె వాగ్వాదానికి దిగింది.దీంతో అతని భార్య కూడా సెన్స్ లేదా అంటూ మండిపడింది. అతను కోపంతో మండిపడుతు ‘‘ఈ మహిళ అసలు మనిషేనా’’.. అంటాడు. దానికి అమె ‘‘నీ భార్య కంటే నేనే బెటర్’’ అంటూ మొండిగా సమాధానం చెబుతుంది. నేను మాత్రం కుక్కకు మాస్క్ వేయను అంటూ వాగ్వాదానికి దిగుతుందే తప్ప.. కుక్క నోటికి మాస్క్ మాత్రం వేయలేదు. పైగా మీరు 30 నిమిషాలు అక్కడే నిలబడ్డా ఓకే నేనుమాత్రం నా కుక్కకు మాస్క్ వేయను అని తెగేసి చెప్పింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా లాజిక్స్ సొసైటీ(Noida Logics Society)లోని లిప్టులో జరిగిన ఈ రచ్చ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
కుక్క మెడలోనే మాస్క్ వేలాడుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. మాస్క్ ఉన్నా వేయనని ఆమె చెప్పటం సరికాదంటున్నారు నెటిజన్లు. ఇటీవల కుక్కలు కరిచిన ఘటనలు జరుగుతున్న క్రమంలో సదరు వ్యక్తులు భయడపటంలో తప్పులేదంటున్నారు. ఈ ఘటనను మొత్తం సదరు దంపతులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో వ్యూస్ భారీగా వస్తున్నాయి.
Noida. Again.
— Prashant Kumar (@scribe_prashant) July 7, 2023