funny Horse Video : అద్దంలో చూసుకుని తెగ సిగ్గు పడిపోయిన గుర్రం .. అంత సిగ్గు దేనికో..
గుర్రం సిగ్గుపడటం ఎప్పుడన్నా చూశారా..? అద్దంలో చూసుకున్న ఓ గుర్రం సిగ్గుల మొగ్గైంది. పదే పదే తనను తాను అద్దంలో చూసుకుని మురిసిపోయింది. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ సిగ్గుల గుర్రం చిందులపై..

Horse Seeing Reacting Mirro
funny Horse : సాధారణంగా కుక్కలు, పిల్లలు, కోతులు అద్దం కనిపిస్తే రకరకాల విన్యాసాలు చేస్తుంటాయి. సోషల్ మీడియాలో ఇటువంటి ఫన్నీ వీడియోలు చాలానే చూస్తుంటాం. కోతులైతే మరీను..అద్దం కనిపిస్తే చాలా ఏం హొయలు పోతాయే చెప్పలేం. అలా పిల్లులు, కుక్కలు, కోతులు వంటి చిన్నపాటి జంతువులు అద్దంలో తమ ప్రతిబింభాన్ని చూసుకుని రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంటాయి. అదే ఓ గుర్రం అద్దంతో తన ప్రతిబింభాన్ని చూసుకుంటే ఎలా ఉంటుందీ..? బహుశా కంగారు పడి ఆ అద్దాన్ని కాలితో ఓ తన్ను తన్నుతుందే అనుకుంటాం కదా..కానీ ఓ గుర్రం మాత్రం అద్దంలో తనను తాను చూసుకుని సిగ్గుల మొగ్గల అయిపోయింది. వామ్మో అద్దంలో పదే పదే చూసుకుని ఏం హొయలు పోయిందో చూస్తే వామ్మో దీని సిగ్గు సిమడా..మరీ అంత సిగ్గేంటే బాబు అనిపిస్తుంది. ఓ గుర్రం అద్దంలో తనను తాను చూసుకుని తెగ సిగ్గుపడిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Birds : పక్షుల గుంపులు ‘V’ ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయో తెలుసా?
అడవుల్లో జంతువుల కోసం సరదాగా ఏర్పాటు చేసిన అద్దాల ముందు కోతులు, చింపాజీలు, పులులు, సింహాలు వంటి జంతువులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూశాం. ఓ గుర్రం అద్దంలో తనను తాన చూసుకుని ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు కూడా తెగ మురిసిపోతున్నారు. ఓ షెడ్డులోకి ఉన్న ఓ అద్దం ముందు గుర్రం నిలబడంది. ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుని అమ్మాయిలా మురిసిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Blind Village : ఆ ఊర్లో మనుషులు, జంతువులకూ కంటిచూపు ఉండదు.. అంతా అంధులే..
ఆ గుర్రం అద్దంలో తనను తాను చూసుకుని మొదట్లో కాస్త షాక్ అయ్యింది. తలను అటూ ఇటూ తిప్పుతూ పదే పదే చూసుకుంది. మళ్లీ మళ్లీ అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. తర్వాత మధ్య మధ్యలో అద్దం దగ్గర తల పెట్టి అదే పనిగా చూసుకుంటుంది. తర్వాత మళ్లీ ముందుకు.. వెనక్కు కదులుతూ చూసుకుంటునే ఉంది. అలా చాలా సేపు చూసుకున్న తరువాత అది తానే అనుకుందో ఏమోగానీ ఆ సమయంలో గుర్రం విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ భలే ఉంది. అలా పదే పదే తనను తాను అద్దంలో చూసుకుని తుర్రుమంటూ బయటకు వెళ్లిపోయింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ సిగ్గుల మొగ్గ గుర్రంపై..
Horse discovers a mirror for the first time.. ? pic.twitter.com/8Dp22INs41
— Buitengebieden (@buitengebieden) August 30, 2023