Tomato Price Rise : టమాటాలు కొని సూట్ కేసులో పెట్టి తాళం వేసి .. దానికి తుపాకీతో కాపలా
మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి వాటిని ఓ బ్రీఫ్ కేసులో పెట్టారు. అత్యంత భద్రంగా. ఏవో బంగారం, డబ్బులు, విలువైన డాక్యుమెంట్లు పెట్టినట్లుగా బ్రీఫ్ కేసులో పెట్టి దానికి తాళం వేసారు. అంతేకాదు..ఆ బ్రీఫ్ కేసుకు ఓ తుపాకీతో కాపాలా కూడా పెట్టారు.

Madhya Pradesh Congress protest Tomato Price
Madhya Pradesh Tomato Price : దేశ వ్యాప్తంగా టమాటాల ధరలు డబుల్ సెంచరీకి దగ్గరగా ఉన్నాయి. దీంతో పప్పులో టమాట కనిపించటమే లేదు. కూరల్లో కానరావటంలేదు. రసంలో టమాటా రుచి దూరమైపోయింది. ఇక టమాటా రైస్ అనే మాటే వినిపించంలేదు. చికెన్ కంటే టమాటా ధరే మోతెక్కుతోంది. ఇలా టమాటాల ధరల గురించి చెప్పాలంటే చాలానే ఉంది. కిలో టమాటా రూ.160 అమ్ముతోంది. కొన్ని చోట్ల అయితే రూ.180 కూడా అమ్ముతోంది. దీంతో డబుల్ సెంచరీకి దగ్గరలో ఉంది టమాటా ధర. ఏ కూరలోనైనా ఇట్టే కలిసిపోయే టమాటా ధరలు కొండెక్కడంతో కూరల నుంచి దూరమైపోయాయి.
దీంతో టమాటా ధరలపై వినూత్నంగా నిరసన తెలిపారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని ఓ బ్రీఫ్ కేసులో పెట్టారు. అత్యంత భద్రంగా. ఏవో బంగారం, డబ్బులు, విలువైన డాక్యుమెంట్లు పెట్టినట్లుగా బ్రీఫ్ కేసులో పెట్టి దానికి తాళం వేసారు. అంతేకాదు..ఆ బ్రీఫ్ కేసుకు ఓ తుపాకీతో కాపాలా కూడా పెట్టారు. తుపాకీ ఒరిజినల్ ది కాదులెండి నకిలీదే. అలా నకిలీ తుపాకీ పట్టుకుని ఆ టమాటాల సూట్ కేసుకు సెక్యురిటీగా పట్టుకుని వెళ్లారు. అలా పట్టుకెళ్లిన టమాటాల సూట్ కేసును కార్యాలయంలో ఉండే ఓ బీరువాలో భద్రపరిచారు. ఇలా వినూత్నంగా టమాట ధరలు భారీగా పెరిగిపోవటంపై నిరసనలు తెలిపారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.
ఈ వినూత్న నిరసనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికారి ప్రతినిథి విక్కీ ఖోంగల్ మాట్లాడుతు..రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణాన్ని దయాన్ (మంత్రగత్తె) గా అభివర్ణించిన బీజేపీ ఇప్పుడేం చేస్తోంది? అని ప్రశ్నించారు. అప్పుడు మంత్రగత్తె అయింది. ఇప్పుడు అది బీజేపీ నేతలకు డార్లింగ్ (ప్రియమైనది)అయింది అంటూ ఎద్దేవా చేశారు.
భోపాల్ లోని 5 నంబర్ మార్కెట్ లో టమాటాలు కొన్న కాంగ్రెస్ నేతలు వాటిని సూట్ కేసులో పెట్టి తాళం వేసి తుపాకీతో సెక్యురిటీగా వారి కార్యాలయాకి వెళ్లి ఆ సూట్ కేసులో బీరువాలో భద్ర పరిచి టమాటా ధరల పెరుగుదల గురించి వినూత్న నిరసన తెలిపారు.
SBI : ఏటీఎం కార్డు లేకుండా అన్ని ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవచ్చు .. ఎలాగంటే..