Amruta Fadnavis : పాముల కంటే మనుషులే విషపూరితమైనవారు’: పాములతో డిప్యూటీ సీఎం భార్య ఫోటోలు వైరల్
పాములతో డిప్యూటీ సీఎం భార్య ఫోటోలు. ‘అత్యంత క్రూరమైన,విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ వ్యాఖ్యలు.

amruta Fadnavis with reptiles
Amruta Fadnavis with reptiles : ‘అత్యంత క్రూరమైన,విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Deputy CM Devendra Fadnavis)భార్య అమృతా ఫడ్నీవీస్ (Amruta Fadnavis) ట్విట్టలో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఆమె పాములు, బల్లులతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తు ఈ కొటేషన్ పెట్టారు. అమృత ఫడ్నవీస్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత భారతీయ బ్యాంకర్,గాయని, సామాజిక కార్యకర్త కూడా. యాక్సిస్ బ్యాంక్‌లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బ్యాంకర్‌గా..ఆమె గత 17 సంవత్సరాల నుండి యాక్సిస్ బ్యాంక్‌లో పని చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాషియర్‌గా చేరిన ఆమె ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా యాక్సిస్ బ్యాంక్‌లో పని చేయడం కొనసాగించారు.
CM Himanta Biswa Sarma : ముస్లింల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయి : అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తు కూడా అమృత తనలోని సామాజిక కోణాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోరు. తరచు వాటికి సంబంధించి పోస్టులు పెడుతుంటారు. వివిధ అంశాల గురించి పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన చిత్రాలతో ఆశ్చర్యపర్చారు. ఏమాత్రం భయపడకుండా చేతుల్లో పాములు, బల్లిని పట్టుకొని ఫొటోలు దిగారు. ‘అత్యంత క్రూరమైన, విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ ఫోటోలో అమృతా ఫడ్నవీస్ ఒక చేతిలో ఒక పాము, రెండో చేతిలో మరో పాముతో ఉన్నారు. మరో ఫోటోలో ఓ బల్లిని చేతిపై ఉంచుకుని దానివైపు ప్రేమగా చూస్తున్నట్లుగా ఉంది. ఈ చిత్రాలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్నది ఇదేనంటూ ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
The most dangerous, poisonous & ferocious animals are only humans ! #FridayFeeling pic.twitter.com/qSHNuQq3Y6
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) July 14, 2023