‘Most Wanted Monkey : కంత్రీ కోతి .. పట్టుకున్నందుకు రూ.21,000 వేలు బహుమతి
ఓ కోతిని పట్టుకోవడానికి జిల్లా కలెక్టర్ ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. డ్రోన్‌లను కూడా ఉపయోగించారు.

Madhya Pradesh Most Wanted Monkey
Madhya Pradesh Most Wanted Monkey : అదొక కోతి. కోతంటే మామూలు కోతి కాదు. కంత్రీకోతి. కనిపించినవారనల్లా కొరికేస్తు జనాలకు చుక్కలు చూపిస్తోంది. దీంతో జనాలు ఆ కోతికనిపిస్తేనేకాదు ఆ కోతి అనే మాట వింటేనే హడలిపోతున్నారు. దాన్ని పట్టుకోవటానికి నానా పాట్లు పడుతున్నారు. కానీ అది ఎంతకూ చిక్కటంలేదు. దీంతో అధికారులు ఫిర్యాదు చేశారు కోతి బాధలు తప్పించమని. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. కానీ వారికి కూడా చిక్కలేదు. దీంతో వారు కోతిని పట్టుకుంటే రూ.21,000లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. చాలామంది ప్రయత్నించారు దాన్ని పట్టుకోవటానికి. కానీ అందరిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తోంది. దీంతో అధికారులు ఆ మర్కటాన్ని పట్టుకోవటానికి ఏకంగా ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజ్‌గఢ్ పట్టణం (Rajgarh)లో ఒక కోతి (Monkey) జనాలు కనిపిస్తే చాలు రెచ్చిపోతోంది. వారిపై దాడి చేస్తోంది. 20 మందిని తీవ్రంగా గాయపరిచింది. ఎనిమిది మంది చిన్నారులపై దాడి చేసింది. వారంతా ఆస్పత్రిపాలయ్యారు. దీంతో స్థానికులు ఎంతో అవసరం ఉంటేనే గానీ బయటకు రావటం మానేశారు. వచ్చిన అటూ ఇటూ చూసుకుని చేతిలో ఏదోక కర్రలాంటిది పట్టుకుని బయటకొస్తున్నారు. ఈ కోతి బాధ ఎంతగా ఉందంటే..ద్వారం తలుపులు తీసి ఉన్నా లోపలికి వచ్చేసి మరీ దాడిచేస్తోంది. దీంతో జనాలు తలుపులు బిగించుకుని లోపలే ఉంటున్నారు. ఆఖరికి కిటికీ తలుపు కూడా బోల్ట్ వేసేసుకుంటున్నారు. దాని బాధలు భరించలేక మున్సిపల్ (Municipal)అధికారులకు మొరపెట్టుకోగా రంగంలోకి దిగిన సిబ్బందికి..అధికారులకు కూడా చుక్కలు చూపించిదా మర్కటం.
Mumbai : ‘ప్రెగ్నెంట్ మ్యాన్’.. నిజంగానే అతని కడుపులో కవలలు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు
ఈ కోతి ప్రతాపం జిల్లా కలెక్టర్ (Collector)వరకు వెళ్లింది. ఈక్రమంలో మున్సిపల్ అధికారులు కోతిని పట్టుకోవడానికి జిల్లా కలెక్టర్ సహాయంతో వారు ఉజ్జయిని (Ujjain teamed)అనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం కోతి కదలికలను గమనించడానికి డ్రోన్‌లను కూడా ఉపయోగించారు. అది ఎక్కడెక్కడ తిరుగుతోందో బాగా గమనించారు. అలా అది సంచరించే ప్రాంతాల్లో పంజరాలను ఏర్పాటు చేశారు. అలా రెండువారాలు అదేపనిలో ఉన్నారు.
ఉజ్జయిని టీమ్ కు స్థానికులు సహాయ సహకారాలు అందించారు. అలా ఎట్టకేలకు ఆ కంత్రీ కోతిని పట్టుకున్నారు. కోతిని పట్టుకున్నందుకు ప్రకటించినట్లుగానే ఉజ్జయిని బృందానికి రూ.21,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు మున్సిపల్ ఛైర్మన్ వినోద్ సాహు తెలిపారు. అలా పట్టుకున్న ఆ కంత్రీ కోతిని దట్టమైన అడవిలో విడిచిపెట్టటానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.