Rahul Gandhi : రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు ఇవ్వను : షాప్ యజమాని పోస్టర్

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు లేదు అంటూ షాపు ఓనర్ పోస్టర్.

Rahul Gandhi : రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు ఇవ్వను : షాప్ యజమాని పోస్టర్

Rahul gandhi

Updated On : April 19, 2023 / 3:55 PM IST

Rahul Gandhi : ‘అరువు అడగవద్దు’ అంటూ కిరాణా షాపుల వద్ద నోటీసులు చూసే ఉంటాం. గతంలో ఇటువంటివి ఉండేవి గానీ ఇప్పుడు అటువంటివి కనిపించట్లేదనే చెప్పాలి. కానీ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో మాత్రం రాహుల్ గాంధీని ఉద్ధేశిస్తూ ఏర్పాటు అయిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు అరువు అడగొద్దు’అంటూ పోస్టర్ పెట్టాడు. దీన్ని ఓ కస్టమర్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఆ షాపు యజమని ఉద్ధేశ్యం రాహుల్ గాంధీ ప్రధాని కాడు అనే ఉద్ధేశమా?లేకా అవ్వాలని ఆకాంక్షా? లేదంటే అరువు అడగకుండా వినూత్నంగా పెట్టినదా? అని అనుకునేలా ఉంది.కానీ.. సదరు షాపు యజమాని దీనిపై క్లారిటీ కూడా ఇచ్చాడండోయ్..

ఛింద్వారా జిల్లా కర్బాలా చౌక్‌లో మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తికి ఓ పాన్‌షాప్ ఉంది. అదో చిన్న పాన్ షాప్. పాన్ ప్రియులు హుస్సేన్ షాపుకు వచ్చి పాన్ తినటం డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోవటం జరుగుతోంది. తెలిసిన వారే కదా తరువాత ఇచ్చేస్తారు కదాని హుస్సేన్ కూడా లైట్ తీసుకునేవాడు. కానీ అందరు డబ్బులు ఇచ్చేవారు కాదు. దీంతో హుస్సేన్ కు ఓ ఐడియా వచ్చింది. ఇలా వినూత్నంగా బోర్డు ఏర్పాటైంది. 2023 జనవరి 1 హుస్సేన్ వినూత్నంగా ఇలా బోర్డు పెట్టాడు. దీనిపై హుస్సేన్ మాట్లాడుతు..నాదో చిన్న పాన్ షాపు. గతంలో చాలామందికి అరువు ఇచ్చాను. కానీ చాలామంది తిరిగి డబ్బులు ఇవ్వలేదు. దీంతో నేను నష్టపోయానని వాపోయాడు.

దీంతో అరువు ఇవ్వబోనంటూ ఇలా వింత పోస్టర్ ను ఏర్పాటు చేశానన్నాడు. కానీ రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడన్నది తన అభిప్రాయం కాదని హుస్సేన్ స్పష్టంచేశాడు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు లేవని అందుకే ఇలా బోర్డు పెట్టానని చెప్పాడు. నిజం చెప్పాలంటే రాహుల్ ప్రధాని కావాలన్నదే తన కోరిక అంటూ చెప్పుకొచ్చాడు హుస్సేన్.