Raksha Bandhan 2023 : ఇది కదా అసలైన రక్షాబంధన్ అంటే .. సోదరుడికి రాఖీ కట్టి కిడ్నీ దానం చేసిన అక్క

సోదరుడు క్షేమంగా ఉండాలని రాఖీ కట్టటమేకాదు నా ప్రాణమైన అడ్డువేసి తమ్ముడిని కాపాడుకుంటానంటు ఓ అక్క కిడ్నీని దానం చేసింది. రాఖీ కట్టి నీకు నేనున్నాను తమ్ముడు అంటూ భరోసా ఇచ్చింది. రాఖీ కట్టిన అక్కచెల్లెళ్లకు అన్నదమ్ములు అండగా ఉండటమేకాదు అక్కచెల్లెళ్లు కూడా ఇలా అండగా ఉంటారని నిరూపించింది అమ్మలాంటి సోదరి.

Raksha Bandhan 2023 : ఇది కదా అసలైన రక్షాబంధన్ అంటే .. సోదరుడికి రాఖీ కట్టి కిడ్నీ దానం చేసిన అక్క

Gujarat Woman Kidney Donate to Brother

Woman Kidney Donate to Brother : ఈరోజు రక్షాబంధన్ వేడుకలు దేశమంతా జరుగుతున్నాయి. సోదరుడి క్షేమం కోసం సోదరీమణులు కట్టే రక్షా బంధన్ కు ఓ మహిళ అసలైన బంధాన్ని తెలియజేసేలా అన్నకు అండగా నిలబడింది. అన్న ప్రాణాల కోసం తన శరీరంలో ఓ భాగాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది. రక్షా బంధన్ రోజున రాఖీ కట్టటమే కాదు అదో వేడుక మాత్రమే కాదు కష్టంలో ఉన్న అన్నకు అండగా నిలబడటమేనని చాటి చెప్పింది. తన కిడ్నీని దానం ఇచ్చి అన్న ప్రాణాల్ని కాపాడేందుకు ముందుకొచ్చింది. రక్షా బంధన్ అంటే రాఖీ కట్టే తోబుట్టువులకు అండగా ఉంటానని అన్నదమ్ములు ధైర్యాన్నివ్వటం. రాఖీ కట్టిన అక్క చెల్లెళ్లకు కానుక ఇవ్వటం ఈ పండుగ విశేషం. కానీ అన్నకు రాఖీ కట్టి నీకు నేనున్నాననే భరోసాను ఇచ్చింది ఓ సోదరి.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోదరుడికి ఓ సోదరి అరుదైన రక్షాబంధన్ కానుక ఇచ్చింది. కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న అన్నకు రెండు కిడ్నీలు దెబ్బతినగా తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకొచ్చింది అతని సోదరి. సోదరుడికి రక్షాబంధన్ కానుక అన్నట్లుగా.. శరీరంలోని ఓ భాగాన్నే దానం చేస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓంప్రకాష్ ధంగర్ (48) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్ మీదనే ఆధారపడి జీవిస్తున్నాడు. ఎవరైనా కిడ్నీ దానంచేస్తే తప్ప కిడ్నీ మార్పిడి చేయించుకునే ఆర్థిక స్తోమతలేదు. అతని రెండు కిడ్నీలు దాదాపు పాడైపోయాయి. డయాలసిస్ మీదనే జీవిస్తున్నాడు. ఒక కిడ్నీ 80 శాతం, మరొకటి 90 శాతం దెబ్బతిన్నాయి. అతని వైద్య ఖర్చుల కోసం అప్పులపాలైంది కుటుంబం. అయినా అతనిని బతికించుకునేందుకు కుటుంబ సభ్యలు చాలా కష్టపడుతున్నారు. డబ్బు అంటే అప్పు చేసి తెచ్చుకోవచ్చు. కానీ అతనికి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరకటం ఇబ్బందిగా మారింది.

Raksha bandhan 2023 : జవాన్‌లకు రాఖీలు కట్టిన మహిళలు,చిన్నారులు

గుజరాత్‌లోని నాడియాడ్‌లోని ఆసుపత్రిలో అతనికి కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించుకుంది.దాత కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దానికి తగిన దాత దొరకలేదు. దీంతో సోదరుడి ఆరోగ్యం గురించి తెలుసుకున్న ఓంప్రకాశ్ అక్క షీలాబాయి పాల్ సోదరుడు ఓంప్రకాశ్ కు తన కిడ్నీ ఇస్తానంటు ముందుకొచ్చింది.

దీంతో ఓంప్రకాశ్ కుటుంబం సంతోషం వ్యక్తంచేసింది. దీంతో ఆమెకు అవసరమైన అన్ని పరీక్షలు చేశారు డాక్టర్లు. ఆమె కిడ్నీ సరిగ్గా సరిపోతుందని చెప్పటంతో సెప్టెంబర్ 3((2023)న కిడ్నీ ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. షీలాబాయి తన తమ్ముడు క్షేమంగా ఉండాలనే ఆకాంక్షతో ఇలా చేస్తున్నానని తెలిపింది. ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయ్యింది. దీంతో ఈ రక్షాబంధన్ వేడుక రోజున కిడ్నీ మార్పిడికి ముందు, షీలాబాయి ఓం ప్రకాష్‌కు తన భద్రత కోసం ప్రతిజ్ఞగా రాఖీని కట్టింది. నువ్వు క్షేమంగా ఉంటావు తమ్ముడు అంటూ అక్కగా ఆశీర్వదించింది. అమ్మగా తన శరీరంలోని అవయవాన్ని తమ్ముడి ఆరోగ్యం కోసం ఇవ్వనుంది.