వర్షంలో నమాజ్ చేసుకుంటున్న ముస్లిం వ్యక్తికి గొడుగు పట్టిన సిక్కు వ్యక్తి.. వీడియో వైరల్

Viral Video: ముస్లిం వ్యక్తి వర్షానికి తడవకుండా సిక్కు వ్యక్తి గొడుగు పట్టిన దృశ్యం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

వర్షంలో నమాజ్ చేసుకుంటున్న ముస్లిం వ్యక్తికి గొడుగు పట్టిన సిక్కు వ్యక్తి.. వీడియో వైరల్

జమ్మూకశ్మీర్‌లోని IIT సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఓ ముస్లిం సోదరుడు నమాజ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా వడగండ్ల వాన స్టార్ట్ అయింది. దీంతో ముస్లిం వ్యక్తిని చూసిన సిక్కు మతానికి చెందిన ఓ వ్యక్తి.. గొడుగుపట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు.

ముస్లిం వ్యక్తి వర్షానికి తడవకుండా ఆ సిక్కు వ్యక్తి గొడుగు పట్టిన దృశ్యం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు మత సామరస్యానికి భారత్ ప్రతీక అని కొనియాడుతున్నారు. భారత దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ మనమంతా మనుషులమంటూ కొందరు కామెంట్లు చేశారు.

మతాలను రాజకీయనాయకులు తమ స్వార్థప్రయోజనాల కోసం వాడుకోకుండా ఉంటే భారతదేశం సోదరభావంతో వెలుగొందుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.