UNESCO: పీరియడ్స్‭పై విస్తృత ప్రచారం చేసేందుకు యునెస్కో-విస్పర్ కీలక కార్యక్రమం

అండ్ జీ విస్పర్‌తో కలిసి యునెస్కో ఇండియా అభివృద్ధి చేసిన ఐదు టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్‌లను పరిచయం చేశారు. "స్పాట్‌లైట్ రెడ్" అనే శీర్షికతో, విడుదల చేసిన ఈ టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్స్ అభ్యాసకులు, అధ్యాపకులు మరియు కమ్యూనిటీ నాయకుల కోసం సమగ్ర వనరులు, వ్యూహాలను అందిస్తాయి.

UNESCO: పీరియడ్స్‭పై విస్తృత ప్రచారం చేసేందుకు యునెస్కో-విస్పర్ కీలక కార్యక్రమం

Updated On : June 19, 2023 / 9:28 PM IST

P and G Whisper: పీరియడ్ ఎడ్యుకేషన్, ప్రొడక్ట్స్ లేకపోవడంతో భారతదేశంలో ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరు చదువు మానేస్తున్నారు. అమ్మాయికి తల్లి మొదటి గురువు. కానీ నివేదికల ప్రకారం 10 మంది తల్లుల్లో ఏడుగురికి పీరియడ్స్ గురించి పూర్తి అవగాహన లేదు. వారు దాన్ని ‘మురికి లేదా అశుద్ధమైనది’గా భావిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. బహిష్టు విద్య, పరిశుభ్రత నిర్వహణ సమస్యను పరిష్కరించడానికి విస్పర్, యునెస్కో ఇండియాలు అమృత విశ్వ విద్యాపీఠంతో కలిసి, ముఖ్యంగా పాఠశాలకు హాజరయ్యే యువతులతో సహా మహిళల్లో అవగాహన పెంచడానికి ఒక కార్యక్రమం ప్రారంభించాయి.

Upasana : డెలివరీ కోసం హాస్పిటల్‌కి చేరుకున్న ఉపాసన.. రేపే జూనియర్ చిరుత ఎంట్రీ..

ఈ సందర్భంగా పీ అండ్ జీ విస్పర్‌తో కలిసి యునెస్కో ఇండియా అభివృద్ధి చేసిన ఐదు టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్‌లను పరిచయం చేశారు. “స్పాట్‌లైట్ రెడ్” అనే శీర్షికతో, విడుదల చేసిన ఈ టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్స్ అభ్యాసకులు, అధ్యాపకులు మరియు కమ్యూనిటీ నాయకుల కోసం సమగ్ర వనరులు, వ్యూహాలను అందిస్తాయి. రుతుస్రావం నిర్వహణకు సంబంధించిన అవగాహన, నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు దాని సామాజిక ప్రభావం గురించి అవగాహన పెంపొందించడం వారి ఉద్దేశ్యం.

Shakti Scheme: కర్ణాటకను మార్చేసిన ఉచిత బస్సు ప్రయాణం.. కిటకిటలాడుతున్న ఆలయాలు, వెలవెలబోతున్న రైళ్లు

విస్పర్, యునెస్కో ఇండియా కూడా #KeepGirlsinSchool ప్రచారం కింద రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణపై జాతీయ సర్వే, గ్యాప్ విశ్లేషణ నివేదికను విడుదల చేశాయి. పేద పట్టణ ప్రాంతాల్లో, 50% యుక్తవయస్సులో ఉన్న బాలికలు (15 నుండి 19 సంవత్సరాల వయస్సు) వారి పీరియడ్స్ నిర్వహణకు పరిశుభ్రమైన పద్ధతులు అందుబాటులో లేవని నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లోని వివిధ పాఠశాలలకు చెందిన బాలికలు, ఉపాధ్యాయులు, పౌర సమాజ సంస్థలతో సహా 220 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.