Viral Video: ఈ వీడియో కచ్చితంగా నవ్విస్తుంది.. మెట్రోలో డ్రామా.. జాలిపడి సీటు ఇచ్చిన మహిళ!

సోషల్ మీడియా కొన్ని విషయాలు సరదాగా ఉంటాయి. ఎంతటి దుఃఖంలో ఉన్న వ్యక్తినైనా క్షణంలో నవ్వించే శక్తి కొన్ని వీడియోలకు ఉంటుంది. ఇలాంటి ఫన్నీ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.

Viral Video: ఈ వీడియో కచ్చితంగా నవ్విస్తుంది.. మెట్రోలో డ్రామా.. జాలిపడి సీటు ఇచ్చిన మహిళ!

Viral Video

Updated On : February 23, 2022 / 1:04 PM IST

Viral Video: సోషల్ మీడియా కొన్ని విషయాలు సరదాగా ఉంటాయి. ఎంతటి దుఃఖంలో ఉన్న వ్యక్తినైనా క్షణంలో నవ్వించే శక్తి కొన్ని వీడియోలకు ఉంటుంది. ఇలాంటి ఫన్నీ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. అటువంటి వీడియోనే ఇది. దీనిని చూస్తే నవ్వు ఆపుకోలేరు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ మెట్రో ట్రైన్‌లో వ్యక్తి చేతిలో చిన్నారి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒడిలో బిడ్డకు ఆహారం ఇస్తున్నట్లుగా ఉంటాడు. మెట్రో మొత్తం ఫుల్ అయిపోగా.. సదరు వ్యక్తికి కూర్చోవడానికి సీటు కూడా లేదు. ఆ వ్యక్తి తన ఒడిలో పిల్లవాడు ఉన్నట్లుగా చేతులు ఊపుతున్నాడు.. ఓ మహిళ అతనిపై జాలిపడి, అతని కోసం లేచి నిలబడి తన సీటును ఇచ్చేస్తుంది.

అయితే, అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. వ్యక్తి ఆ సీటులో కూర్చున్న వెంటనే, అతని చేతిలో పిల్లవాడు లేడు అనే విషయం వెలుగులోకి వచ్చేస్తుంది. సీటు కోసం ఓ దుప్పటిలోపల చిన్నారి ఉన్నట్టుగా బ్రమింపజేశాడు. అతని చేతిలో పిల్లాడు లేడు అని తెలుసుకోగానే సీటు ఇచ్చిన సదరు మహిళ ఒక్కసారిగా ఆగ్రహంగా కనిపించింది.

అయితే, వెంటనే సీటులో నుంచి లేచి ఆ మ‌హిళ‌ని త‌న సీటులోనే కూర్చోమ‌ని చెప్పాడు ఆ వ్యక్తి. సదరు వ్యక్తి సరదాగానే ఈ పని చేసినట్లుగా మొత్తం వీడియో చూస్తే అర్థం అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by ОТБИТЫЙЯ (@otbitiya)