Viral Video: గుజరాత్ జానపద గాయకుడు పాడిన పాటకు పరవశించిపోయి నోట్ల వర్షం కురిపించిన ప్రేక్షకులు

గుజరాత్ జానపద గాయకుడు కీర్తిదాన్ గాధ్వి ఓ కార్యక్రమంలో పాట పాడగా ఆయనపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. ఆ రాష్ట్రంలోని వల్సాద్ లో ఈ ఘటనచోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Viral Video: గుజరాత్ జానపద గాయకుడు పాడిన పాటకు పరవశించిపోయి నోట్ల వర్షం కురిపించిన ప్రేక్షకులు

Viral Video

Updated On : March 12, 2023 / 3:12 PM IST

Viral Video: జానపద పాటలు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మన అభిమాన జానపద గాయకులు పాడే పాటలకు పరవశించిపోతాం. మనల్ని ఇంతగా ఆనందింపజేస్తోన్న వారికి ఏం ఇచ్చినా సరిపోదని చాలా మంది భావిస్తుంటారు. తాజాగా, గుజరాత్ లో జరిగిన ఓ ఘటన చూస్తే జానపద పాటలకు ప్రజలు ఎంతగా పరవశించిపోతారో అర్థమవుతుంది.

గుజరాత్ జానపద గాయకుడు కీర్తిదాన్ గాధ్వి ఓ కార్యక్రమంలో పాట పాడగా ఆయనపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. ఆ రాష్ట్రంలోని వల్సాద్ లో ఈ ఘటనచోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గత రాత్రి వల్సాద్ అగ్నివీర్ గో సేవా దళ్ ప్రత్యేక భజన కార్యక్రమం చేపట్టింది. ఆ సందర్భంగా కీర్తిదాన్ గాధ్వి జానపద పాటలు పాడారు.

ఆయన పాడుతుండగా ప్రేక్షకులు పరవశించిపోయి రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను వేదికపైకి వెదజల్లారు. గతంలోనూ పలు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ లో జానపద గాయకులకు చాలా మంది అభిమానులు ఉన్నారు.

Rajinikanth: రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణమేంటో చెప్పిన రజనీకాంత్.. వెంకయ్య నాయుడుపై కీలక వ్యాఖ్యలు..