Wedding Photo Shoot : విడాకులు తీసుకుందట..పెళ్లి ఫోటోలకిచ్చిన డబ్బులు ఇచ్చేయాలని ఫోటో గ్రాఫర్కు వేధింపులు .. భోజనాలు తిన్నవారి సంగతేంటీ అంటూ సెటైర్లు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుగా ఉంది ఫోటో గ్రాఫర్ పరిస్థితి..వాళ్లు విడాకులు తీసుకోవటమేంటీ..నేనిలా బుక్ అయిపోవటమేంటీ..వాళ్లు విడాకులు తీసుకోవటమేంటి. డబ్బుల కోసం నన్ను వేధించటమేంటి? అంటూ తల పట్టుకున్నాడో ఫోటో గ్రాఫర్..

Woman Demands money Refund
Wedding Photo Shoot : ఈరోజుల్లో పెళ్లి ఖర్చుకంటే ఫోటో షూట్ ల ఖర్చులు కూడా మామూలుగా ఉండట్లేదు.లక్షల్లో ప్యాకేజ్ లతో ఫోటో గ్రాఫర్లు బిజీ బిజీగా ఉంటున్నారు.ఒకప్పుడు పెళ్లి అంటే ఫోటోలు మాత్రమే ఉండేవి. ఆ తరువాత వీడియోలు వచ్చాయి. కానీ ఇవన్నీ పెళ్లిలో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు. పెళ్లికి ముందే వధువరులు ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్టులతో ఫోటో షూట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ ఫోటో గ్రాఫర్ ఓ జంటకు ఫోటోలు తీశాడు ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. పెళ్లి జరిగింది. భారీగా అనుకున్నంత బిల్లు వచ్చింది. దీంతో పెళ్లి ఫోటోలను చక్కగా డిజైన్ చేసి మరీ వధువరులకు ఇచ్చేశాడు. ఆ తరువాతే అతనికి దిమ్మతిరిగే సందర్భం వచ్చింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుగా ఇటువంటి పరిస్థితి ఏ ఫోటో గ్రాఫర్ కూడా రాకుండదంటూ తలపట్టుకున్నాడు పాపం..
2019లో ఓ జంట పెళ్లి చేసుకుంది. డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలను కాప్చర్ చేయానికి ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ను ఏర్పాటు చేసుకున్నారు. పెళ్లి జరిగింది. నాలుగేళ్లైంది. కానీ వారిద్దరు విడిపోయారు.విడాకులు కూడా తీసుకున్నారు. అప్పుడు మొదలైంది వారి పెళ్లి ఫోటోలు తీసిన ఫోటో గ్రాఫర్ కు. తన పెళ్లికి ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్కు మెసేజ్ పెట్టింది సదరు మహిళ. ‘నేను మీకు గుర్తున్నానా 2019లో నా పెళ్ళికి మీరు ఫోటోలు తీశారు’ అంటూ మెసేజ్ చేసింది. దానికి సదరు ఫోటోగ్రాఫర్ కూడా స్పందిస్తు ‘నాకు గుర్తున్నారు మాడమ్ ’ అని తిరిగి మెసేజ్ పెట్టాడు. తరువాత ఆమె ‘ఇప్పుడు నేను విడాకులు తీసుకున్నాను, నా పెళ్లి ఫోటోలు నాకు అవసరం లేదు ఫోటోల కోసం నేను మీకు ఇచ్చిన డబ్బులు వాపస్ ఇచ్చేయండి’అని మెసేజ్ పెట్టింది. అది చదివిన ఫోటోగ్రాఫర్కు దిమ్మ తిరిగింది. ఇదేందిరాబాబు వాళ్లు విడాకులు తీసుకుంటే నేనెందుకు డబ్బులుతిరిగి ఇవ్వాలి? అని అనుకున్నాడు.
అదే విషయాన్ని ఆమెకు మెసేజ్ ద్వారా తెలిపాడు. దానికి ఆమె కుదరదు నా డబ్బులు నాకిచ్చేయండి అంటూ వాదించటం మొదలుపెట్టింది. అలా మెసేజ్ ల రూపంలో ఇద్దరు వాదించుకున్నారు. అయినా సరే ఆమె వెనక్కి తగ్గలేదు. డబ్బులు ఇచ్చేయాల్సిందే అంటూ వేధించటం మొదలుపెట్టింది. డబ్బుల ఇవ్వకపోతే లీగల్ గా తేల్చుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇదేం గోలరా బాబూ అంటూ తలపట్టుకున్నాడు ఫోటో గ్రాఫర్. పోనీ కనీసం 70శాతం డబ్బులైనా ఇవ్వాలని మంకుపట్టుక్కూర్చుంది. ఆమెతో విసిగి పోయిన ఫోటోగ్రాఫర్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ మెసేజ్లను పోస్ట్ చేశాడు. ఆమె నుంచి విడాకులు తీసుకున్న భర్త కూడా ఆ మెసేజ్లు చదివి షాక్ అయ్యాడు. ‘ఇది చాలా అవమానకరం..’ అంటూ మెసేజ్ పెట్టాడు.
ఈ గోల అంతా నెటిజన్లకు వింతగా అనిపించింది. బహుశా ఏ ఫోటో గ్రాఫర్ కు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండదేమో అంటున్నారు. సదరు ఫోటో గ్రాఫర్ పెట్టిన పోస్టుకు 3.8 లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. ఇటువంటి మెంటాలిటీ ఉన్న ఆమే విడాకులకు కారణం అయి ఉంటుందని కొంతమంది..ఇలాంటి వారితో ఎవరు మాత్రం కలిసి ఉండగలరు అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు ఇంకొందరైతే ‘ఆమెగారి పెళ్లిలో భోజనాలు చేసిన వారి పరిస్థితి ఏంటో..భోజనానికి సరిపడా డబ్బును కట్టమని అడగలేదు’ అంటూ జోకులు వేసుకుంటున్నారు.
I swear my life is a movie 🤦🏽♂️🤣 you can’t make this stuff up.
ThaboBesterArrested Musa xoli Boity #NOTA
Pretoria East Dr Pashy #RIPAKA Ananias Mathe Venda #AskAMan Bonagni Fassie Midrand Stage 5 Andile Costa #DrNandipha Gayton Langa Penuel pic.twitter.com/3RKTkY1OkD— LanceRomeoPhotography (@LanceRomeo) April 11, 2023