Gold Silver Prices Today : బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర.. ఏపీ, తెలంగాణలో నేటి రేట్లు ఇవే..
Gold Silver Prices Today : నేడు బంగారం ధర తగ్గింది. గురు, శుక్రవారాల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. శనివారం తగ్గింది.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేటు తగ్గింది. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర.. నేడు తగ్గింది.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతుండగా.. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారంపై 47డాలర్లు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,170 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,46,730 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,34,500 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,46,880 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,34,650 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,460కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,37,000 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
