Ibrahim Zadran : ఆ తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. టీమ్ఇండియాకు చుక్కలే .. అఫ్గాన్ కెప్టెన్..
భారత్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమిపై అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) స్పందించాడు.
IND vs AFG 1st T20 match afghanistan captain Ibrahim Zadran comments
Ibrahim Zadran : భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ చేతిలో అఫ్గానిస్థాన్ ఘోరంగా ఓడిపోయింది. కాగా.. బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ అన్నాడు.
అజ్మతుల్లా ఒమర్జాయ్ (64 నాటౌట్; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా మహ్మద్ నబీ (33; 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. టీ20క్రికెట్లో ఏకైక భారతీయుడు
ఆ తరువాత 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (82; 32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్థశతకం బాదాడు. ఇషాన్ కిషన్ (42; 33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో నబీ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీశాడు.
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ స్పందించాడు. పిచ్ బాగుందని, భారీ స్కోరు నమోదు చేయాల్సింది అని, అయితే.. అలా చేయలేకపోయామన్నాడు. బ్యాటింగ్‌లో తొలి మూడు ఓవర్లలో మంచి ఆరంభం లభించినప్పటికీ, ఆ తర్వాత మేము ఆ స్థాయి ప్రదర్శనను కొనసాగించలేకపోయాము. వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల భారత్ మాపై ఒత్తిడి పెంచగలిగింది. మధ్య ఓవర్లలో మేము బాగానే బ్యాటింగ్ చేసినా, అనుకున్న స్థాయిలో భారీ స్కోరును సాధించలేకపోయాము. వారి బౌలర్లు, ఫీల్డర్లు అద్భుతంగా రాణించారు. అని జద్రాన్ తెలిపాడు.
ముఖ్యంగా తన రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని తెలిపాడు. ఇషాన్ కిషన్ బంతిని అందుకుని బౌలర్ వైపు విసిరిన తీరు మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. తద్వారా వారు పట్టు సాధించారు. ఇక గుర్బాజ్‌కు ఈ రోజు కలిసిరాలేదు. కానీ అతను మరింత బలంగా పుంజుకుంటాడని నేను భావిస్తున్నాను. అతని నుంచి మేము అదే ఆశిస్తున్నాము. మొత్తంగా చూస్తే.. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ అద్భుతంగా రాణించింది. అని జద్రాన్ అన్నాడు.
