Bharat Jodo Yatra In Kurnool: కర్నూల్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు.. (ఫొటో గ్యాలరీ)
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. రెండోరోజు బుధవారం అదోని మండలం చాగి నుంచి ఉదయం 6.30 గంటలకు రాహుల్ పాదయాత్ర ప్రాంరభమైంది. రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాహుల్‌తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు యువత, చిన్నారులు పోటీపడ్డారు. ఉదయం చాగి నుంచి ప్రారంభమైన యాత్ర ఢణాపురం మీదుగా ఆదోని పట్టణానికి రాహుల్ చేరుకున్నారు. మధ్యాహ్న సమయంలో విరామం అనంతరం.. సాయంత్రం 4గంటలకు యాత్ర వివిధ గ్రామాల మీదుగా ఎమ్మిగనూరు మండలంలోకి ప్రవేశించనుంది. రాహుల్ వెంట కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, జేడీ శీలం, పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు.





















