24 గంటలు 58 జీవోలు: ఎన్నికల వేళ చంద్రబాబు చాణక్యం
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు ఊహించని షాకిచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా... అది కూడా సెలవు రోజున సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు ఊహించని షాకిచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా… అది కూడా సెలవు రోజున సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు ఊహించని షాకిచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా… అది కూడా సెలవు రోజున సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేసింది. ఫలితంగా ఆదివారం(మార్చి 10) నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. కేంద్రం వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం .. సెలవు రోజే 58 కీలక జీవోలు జారీ చేయించేశారు.
ముందుగా సోమ(మార్చి 11) లేదంటే మంగళ వారాల్లో(మార్చి 12) ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని అంతా భావించారు. చంద్రబాబు మాత్రం ఆదివారమే(మార్చి 10) ఎన్నికల షెడ్యూల్ విడుదల ఖాయమేనని అంచనా వేశారు. ఆయన అనుకున్నట్టుగానే కేంద్ర ఎన్నికల సంఘం సెలవు రోజు అయినప్పటికీ ఆదివారమే(మార్చి 10) సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. కేంద్రం వ్యూహాలను ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు.. ఈసీ ఇచ్చిన షాక్ నుంచి బయటపడ్డారు.
ఎన్నికల్లో వివిధ వర్గాలను ఆకట్టుకునేలా పలు సంక్షేమ పథకాలను ప్రకటించిన చంద్రబాబు.. వాటిలో చాలా వాటికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. చాలా వాటికి ప్రభుత్వం నుంచి జీవోలు రావాల్సి ఉంది. కోడ్ అమల్లోకి వస్తే… వాటికి సంబంధించిన జీవోలు విడుదల చేయడం కుదరదు. దీంతో చంద్రబాబు అప్పటికప్పుడు మొత్తం పని కానిచ్చేశారు. సెలవు రోజే అయినా ఉన్నపళంగా అధికారులంతా సెక్రటేకరియట్‌కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసి రప్పించారు. ఆ వెంటనే .. ఇప్పటిదాకా ప్రకటనలు గుప్పించి అధికారిక ఉత్తర్వులను పెండింగ్‌లో పెట్టిన వాటన్నింటికీ .. కోడ్ అమల్లోకి వచ్చేలోగానే సింగిల్ సిట్టింగ్‌లో జీవోలు జారీ చేశారు.
ఈ జీవోల్లో రైతుల రుణమాఫీకి సంబంధించిన కీలక ఆదేశాలు కూడా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు… ఇప్పటిదాకా 3 విడతల సొమ్మునే రైతులకు అందజేశారు. 4, 5 విడతల సొమ్ము ఇంకా విడుదల కాలేదు. అప్పు చేసి అయినా ఈ సొమ్మును ఇచ్చేస్తామని ప్రకటించిన చంద్రబాబు… అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉరుము లేని పిడుగులా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా… మధ్యాహ్నానికే 2 విడతల రుణ మాఫీకి సంబంధించిన జీవోను చంద్రబాబు సర్కార్ అధికారికంగా జారీ చేసింది. మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ పుణ్యమా అని రైతులకు ఇప్పుడు 4, 5 విడతల రుణ మాఫీ సొమ్ము త్వరలోనే వారి ఖాతాల్లో జమ కానుంది.