AIADMK: గొడవలు సద్దుమణిగాయి.. కేంద్ర మంత్రివర్గంలోకి అన్నాడీఎంకే!
అన్నాడీఎంకేనే ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అమిత్ షా ప్రకటన అనంతరమే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కూడా బీజేపీతో పొత్తుపదిలమని పేర్కొన్నారు

AIADMK and BJP
AIADMK: తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య బయటికి చెప్పని ఘర్షణలు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా బీజేపీ నుంచి అన్నాడీఎంకేలోకి పెద్ద ఎత్తున నాయకులు వలస వెళ్తున్నారు. వారంతా ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోనే అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య అగాధం పెరుగుతుందనే వార్తల నడుమ పరిస్థితులు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. ఇరు పార్టీల మధ్య సఖ్యత ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతే కాదు, కేంద్ర మంత్రి వర్గంలోకి అన్నాడీఎంకే వెళ్లనున్నట్లు కూడా తెలుస్తోంది.
Karnataka Polls: ఢిల్లీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ వరుస భేటీలు.. కర్ణాటక ఎన్నికల్లో కీలక బాధ్యతలు?
ఇందుకు అన్నాడీఎంకేనే ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అమిత్ షా ప్రకటన అనంతరమే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కూడా బీజేపీతో పొత్తుపదిలమని పేర్కొన్నారు. ఇక ఆ పార్టీ ఎంపీ తంబిదురై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను, బీజేపీ జాతీయ కమిటీ అధ్యక్షుడు జేపీ నడ్డాను తాజాగా కలుసుకోవడం చర్చలకు దారితీసింది.
ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు తన అభిప్రాయాలను తెలియజేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తరచూ ఎంపీ తంబిదురైని రాయబారిగా పంపుతుంటారని పార్టీ నేతలు చెప్పారు. ఆ దిశగానే ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శిగా తాను ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని, పార్టీ అభివృద్ధి చెందుతున్న విషయాలను గురించి బీజేపీ జాతీయ నాయకులకు తెలియజేసేందుకు తంబిదురైని పంపినట్లు పేర్కొన్నారు. ఆ ప్రకారంమే తంబిదురై.. అమిత్‌షా, జేపీ నడ్డాలను కలుసుకున్నారని, ఆ సమయంలో కేంద్ర మంత్రివర్గంలో అన్నాడీఎంకేకి స్థానం కల్పించాలని కూడా తంబిదురై కోరారని చెప్పారు.