Punjab Politics: ప్రాణాలైనా లెక్కచేయరు.. పంజాబీలపై హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు

తి సంక్షోభం నుంచి దేశాన్ని పంజాబ్ రక్షించింది. పంజాబీలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశానికి భద్రత కల్పించారు. మా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చాను. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను నరేంద్ర మోదీ పెంచారు

Punjab Politics: ప్రాణాలైనా లెక్కచేయరు.. పంజాబీలపై హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు

Updated On : June 18, 2023 / 4:35 PM IST

Amit Shah: పంజాబీలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. దేశం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా ప్రాణాలు లెక్కచేయకుండా కాపాడుకునేందుకు పంజాబీలు ముందుంటారని ఆయన అన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఇక ఇదే కార్యక్రమం నుంచి పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై విరుచుకుపడ్డారు. ‘‘పన్ను చెల్లింపుదారుల సొమ్మును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనలకు భగవంత్ మాన్ వినయోగిస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) లాంటి ఉచిత వాగ్దానాలు చేసే ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. పంజాబ్ సీఎం పని కేజ్రీవాల్‌కు విమానాలు సమకూర్చడం మాత్రమే. దాని వల్ల పంజాబ్‌లో శాంతిభద్రతలు మరింత అధ్వాన్నంగా మారుతున్నాయి. కేజ్రీవాల్ బాగోగులు చూస్తున్న ముఖ్యమంత్రికి పంజాబ్‌ ప్రజల బాగోగులు చూడడానికి సమయం లేదు’’ అని అన్నారు.

ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చాను
‘‘ప్రతి సంక్షోభం నుంచి దేశాన్ని పంజాబ్ రక్షించింది. పంజాబీలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశానికి భద్రత కల్పించారు. మా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చాను. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను నరేంద్ర మోదీ పెంచారు. దేశం గర్వించే పని మోదీ చేశారు. ప్రధాని ఇప్పుడే జీ7 సదస్సుకు వెళ్లి అక్కడి నుంచి ఆఫ్రికా వెళ్లారు. అక్కడ ఎవరైనా ఆటోగ్రాఫ్ అడుగుతారు, ఎవరైనా సమయం కోసం అడుగుతారు, ఎవరైనా ఆయన పాదాలను కూడా తాకుతారు. మోదీ ఎక్కడికి వెళ్లినా మోదీ-మోదీ నినాదాలు వస్తాయి. ఈ నినాదాలు బీజేపీ కోసమో మోదీ కోసమో కాదు, దేశ గౌరవార్థం ఈ నినాదాలు వస్తున్నాయి’’ అని షా అన్నారు.

షా ర్యాలీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
మరోవైపు, కేంద్ర హోంమంత్రి ఈ ర్యాలీకి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు గురుదాస్‌పూర్ ఎస్‌ఎస్‌పీ దయామ హరీష్ కుమార్ ఓంప్రకాష్ తెలిపారు. భద్రత పరంగా నాలుగు జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. గురుదాస్‌పూర్, అమృత్‌సర్, పఠాన్‌కోట్, బటాలా జిల్లాల నుంచి పోలీసు సిబ్బందిని రప్పించారు. ర్యాలీ వేదికపై పోలీసులు అన్ని అంశాలపై నిఘా ఉంచారు. దీంతో పాటు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను కూడా రంగంలోకి దించారు.