కేసులు ఎత్తివేత, పెన్షన్లు పెంపు : ఏపీ కేబినెట్ నిర్ణయాలు

అమరావతి: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించారు. కాపులకు

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 03:56 PM IST
కేసులు ఎత్తివేత, పెన్షన్లు పెంపు : ఏపీ కేబినెట్ నిర్ణయాలు

Updated On : January 31, 2019 / 3:56 PM IST

అమరావతి: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించారు. కాపులకు

అమరావతి: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించారు. కాపులకు 5శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. పెన్షన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే.. నాయీ బ్రాహ్మణులకు 150యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నాలుగన్నర గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది.

 

* సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత
* జీవితఖైదు అనుభవిస్తున్న 33మందికి విముక్తి
* పెన్షన్ల పెంపునకు ఆమోదం
* డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయం
* కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం
* అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులపై నిర్ణయం
* హైకోర్టులో రూ.250కోట్లు డిపాజిట్ చేసి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని నిర్ణయం