గాడి తప్పిన CFMS : ఏపీ సీఎస్ సీరియస్

సమగ్ర ఆర్థిక నిర్వాహణ వ్యవస్థ (CFMS) పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కీలకమైన బిల్లులను పెండింగ్‌లో ఉంచి తమకు నచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత కింద బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏపీ సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే కుదరదని..ఆర్థిక నిర్వాహణ ఇలా ఉంటే ఏపీ రాష్ట్రంలో సమస్యలు ఏర్పడుతాయని..సరిదిద్దుకోవాలంటూ సీఎస్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. బిల్లులు పెండింగ్‌లో ఉండడం..ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందకపోవడం..తదితర కంప్లయింట్స్ రావడంతో సీఎస్ CFMS పనితీరుపై ఆరా తీశారు.
శాప్ అనే ప్రైవేటు సంస్థ CFMS బాధ్యతలు చూస్తోంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి ఉండాల్సిన పాస్ వర్డ్ ఇతరత్రా వ్యవహారాలు కూడా శాప్ దగ్గరే ఉన్నాయి. ప్రాధాన్యత రంగాలైన శాఖలకు మొదట బిల్లులు కేటాయించాలని..తదితర నిబంధనలు ఉన్నాయి. వీటిని బేఖాతర్ చేస్తూ..తమకు నచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత కింద పరిగణించి బిల్లులు కేటాయిస్తోందని ఆరోపణలు వచ్చాయి.
దీంతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం రెండు రివ్యూలు నిర్వహించారు. కొంతమందికి జీతాలు రాలేదని..పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోలేని పరిస్థితి ఉందని తెలుసుకున్నారు. దీనిపై అధికారులపై సీరియస్ అయ్యారు. 17వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు గమనించారు. తొలుత ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని, అలాగే రీపేమెంట్లు సకాలంలో చేయాలని సీఎస్ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు.