CM Jagan Election Campaign : ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధం..! 16 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచార భేరి..!

26 జిల్లాల్లో సభలు, రోడ్ షో లలో పాల్గొననున్నారు. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

CM Jagan Election Campaign : ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధం..! 16 నుంచి  ఉత్తరాంధ్రలో ప్రచార భేరి..!

CM Jagan Election Campaign : రేపు అద్దంకిలో వైసీపీ చివరి సిద్ధం సభ నిర్వహించనుంది. అందరి చూపు ఆఖరి సిద్ధం సభ వైపే ఉంది. చివరి సభ కావడంతో వైసీపీ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. నవరత్నాలకు తోడు మరిన్ని పథకాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు సీఎం జగన్. మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు జగన్.

ఉత్తరాంధ్ర నుంచి ప్రచారాన్ని స్టార్ట్ చేయనున్నారు జగన్. 26 జిల్లాల్లో సభలు, రోడ్ షో లలో పాల్గొననున్నారు. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కూటమి టార్గెట్ గా జగన్ ప్రచారం నిర్వహించబోతున్నారు. ఎన్నికల ప్రచారం చివరిలో ప్రతిరోజూ నాలుగైదు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయనున్నారు జగన్.

సిద్ధం సభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. ఇప్పటికే మూడు సిద్ధం సభలను నిర్వహించింది. ఇక ఆఖరి సభ రేపు అద్దంకిలో జరగబోతోంది. ఇప్పటివరకు జరిగిన మూడు సిద్ధం సభలకంటే భిన్నంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఎక్కువమంది హాజరయ్యే విధంగా అద్దంకిలో జరగబోయే సిద్ధం మహాసభను రెడీ చేశారు. ఈ మహాసభకి 15లక్షల మందికిపైగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, కేడర్ అంతా హాజరవుతుందని వైసీపీ చెప్పింది. ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. నవరత్నాలు కొనసాగింపుగా ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

Also Read : బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు