గొంతు పిసికి చంపాలని చూస్తారా? వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా? గొంతు పిసికి చంపాలని చూస్తారా?

YS Sharmila
YS Sharmila Reddy : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పోలీసులు వ్యవహరించిన తీరును షర్మిల ఖండించారు. మీరు పోలీసులా లేక YCP కిరాయి మనుషులా? అంటూ ధ్వజమెత్తారు. సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ నాయకుల దాడి ఘటనపై షర్మిల స్పందించారు. ఎక్స్ లో ఘాటుగా పోస్టు పెట్టారు.
”పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా? ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా? గొంతు పిసికి చంపాలని చూస్తారా? YCP గూండాలను పక్కన పెట్టి మరీ దాడులు చేయిస్తారా? మీరు పోలీసులా లేక YCP కిరాయి మనుషులా? ఇష్టారాజ్యంగా కొట్టడానికి ఎవరిచ్చారు మీకు హక్కు? కండువా లేని వైసీపీ కార్యకర్తలు మన పోలీసులు. సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటనపై వెంటనే డీజీపీ స్పందించాలి. విచక్షణారహితంగా కొట్టిన పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి” అని డిమాండ్ చేశారు షర్మిల.
Also Read : పిఠాపురం సీటు ఎందుకంత హాటు? గెలుపుపై పార్టీల ధీమా వెనుక కారణమేంటి