హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో రివర్స్ టెండరింగ్ : రూ.104 కోట్లు ఆదా

  • Published By: chvmurthy ,Published On : December 26, 2019 / 11:43 AM IST
హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో రివర్స్ టెండరింగ్ : రూ.104 కోట్లు ఆదా

Updated On : December 26, 2019 / 11:43 AM IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాకు మరో రూ.104 కోట్లు ఆదా చేశారు. రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్  చేపట్టి తాజాగా గురువారం నాడు మరో రూ.104 కోట్లను ఆదా చేశారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ పనులకు ప్యాకేజిల వారీగా నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా నెల్లూరు, వైయస్ఆర్ కడప జిల్లాలకు సంబంధించిన ప్యాకేజి లో  రూ. 942.90 కోట్ల అంచనా వ్యయంతో 19,296 యూనిట్ల నిర్మాణం కోసం రివర్స్ టెండర్లను ఆహ్వానించారు. 

టెండర్ల ప్రక్రియలో డి.ఇ.సి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సంస్థ రూ.839.01 కోట్లకు బిడ్ ను దాఖలు చేసి ఎల్ 1 గా నిల్చింది. గతంలో రెండు విడతల్లో 20,864 యూనిట్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి రూ.151.94 కోట్ల ను భారాన్ని తగ్గించామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 

దీంతో పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనుల్లో పిలిచిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో 7 ప్యాకేజిల్లో రూ. 1966 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో 40,160 యూనిట్ల  నిర్మాణపు పనుల్లో రూ. 255.94 కోట్లను ఆదా చేశామని మంత్రి పేర్కొన్నారు.
 

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తున్నదని, గృహ నిర్మాణాలకు సంబంధించి మరిన్ని ప్రాజెక్టులకు కూడా రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.