చంద్రబాబుకు శిక్ష తప్పదు.. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి?- మంత్రి గుడివాడ అమర్నాథ్
బెయిల్ మీద వచ్చిన దొంగ చంద్రబాబు. ఈరోజు కేసు కొట్టేసినట్లు, కడిగిన ముత్యంలా బయటకు వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు అని విరుచుకుపడ్డారు.

Gudivada Amarnath Slams TDP Chief Chandrababu Naidu
Gudivada Amarnath : చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఎటువంటి రిలీఫ్ కలగలేదని ఆయన చెప్పారు. దానిపై చంద్రబాబు ఏదో విజయం సాధించినట్లు కొన్ని ఛానల్స్ సంబరపడుతున్నాయని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. 17ఏపై ఇంకా విచారణ ఉందని గుర్తు చేశారు. అది చంద్రబాబుకు వర్తిస్తుందా? లేదా? అనేది కోర్టు చెబుతుందన్నారు. ఇప్పటివరకు మేము తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పడం లేదన్నారు. 17ఏ మీద ఇద్దరు జడ్జిల భిన్నాభిప్రాయాలు చూశామన్నారు.
ఓటుకు నోటుకు కేసులో కూడా సెక్షన్ 8 అమల్లో ఉందని వితండ వాదం చేశారని మంత్రి అమర్నాథ్ గుర్తు చేశారు. సెక్షన్ 17ఏ అమల్లోకి వచ్చిన తర్వాత.. అవినీతి కేసుల్లో వర్తిస్తుందని అమల్లోకి రాకముందు వర్తించదని 6 కోర్టులు చెప్పాయన్నారు. బెయిల్ మీద వచ్చిన దొంగ చంద్రబాబు అని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. మీకు ప్రజలు అధికారం ఇస్తే ఆక్రమాలు, అవినీతి చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు కేసు కొట్టేసినట్లు, కడిగిన ముత్యంలా బయటకు వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు అని విరుచుకుపడ్డారు. నాలుగు నెలలుగా ఈ కేసు నడుస్తున్నా.. నేను తప్పు చెయ్యలేదు అని ఇప్పటివరకు చంద్రబాబు చెప్పలేదన్నారు. ప్రజా కోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదు హెచ్చరించారు మంత్రి అమర్నాథ్.
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..!
ఇక, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం అంశంపైనా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో లేని పార్టీ కాంగ్రెస్.. అటువంటి పార్టీకి కొత్త అధ్యక్షులు వస్తున్నారని ఎద్దేవా చేశారాయన. రాష్ట్రంలో ప్రభావం లేని పార్టీకి అధ్యక్షులు ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? అని కామెంట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఓటు వేసే వాళ్ళే లేరని వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల ప్రభావం సున్నా శాతం మాత్రమే అని తేల్చి చెప్పారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాకపోతే వాళ్ళ నాన్న కాంగ్రెస్ లో జాయిన్ అయినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని మండిపడ్డారాయన.
Also Read : ఆ 13 మంది ఎవరు? ఎంపీ అభ్యర్థులపై వైసీపీ ముమ్మర కసరత్తు