చంద్రబాబు.. నీ పార్టీ ఆఫీస్ వైసీపీ స్టోర్ రూమ్‌లో పెట్టిస్తా

చంద్రబాబు.. నీ పార్టీ ఆఫీస్ వైసీపీ స్టోర్ రూమ్‌లో పెట్టిస్తా

Updated On : November 16, 2019 / 11:25 AM IST

వల్లభనేని వంశీ తెదేపా పార్టీపై చేసిన విమర్శల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ మేర మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారి వైఎస్సార్సీపీలోకి వచ్చినందుకు నన్ను అంటున్నారు. చంద్రబాబు నాయుడు 35ఏళ్ల క్రితమే కాంగ్రెస్ నుంచి తెదేపాలోకి వచ్చాడు. ఆ రోజు ఆయన చేసిన పనే ఈ రోజు మేం చేశాం. చంద్రబాబు ఏదైతే మేమూ అదే అవుతామని అన్నారు. 

చంద్రబాబు ఉదయం టిఫిన్ తిని, రాత్రికి భోజనం చేసేవరకూ 12గంటల దీక్ష అని చెబుతున్నారు. మధ్యలో మళ్లీ ఫ్రూట్స్ తింటారు. ఇందులో దీక్ష ఏంటి. ఈ దీక్షలో నిజం లేదని దమ్ముంటే రోజూ ఇసుక మీద, ఇంగ్లీష్ మీడియం మీద ప్రెస్ మీట్ పెట్టు. జనమే నీకు సమాధానం చెబుతారు. ఆయన చేసేవన్నీ మనుగడ కోసమే. నీ జన్మంతా పోరాడినా నువ్వు పార్టీ సీఎం కాలేవు. అని చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అంటున్నా మీరు ప్రత్యక్ష హోదాలో ఉంటున్నారంటే, అది ఆయన మంచితనం. సీఎం పెట్టుకున్న విధి విధానాల వల్లే మీరింకా ఈ హోదాలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే మీ పార్టీ ఆఫీసుని వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ స్టోర్ రూంలో పెట్టిస్తాం. ఇంకోసారి మా పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కొడాలి నాని.