నేను రిటైర్ అవుతున్నా, పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు

నేను రిటైర్ అవుతున్నా, పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated On : February 4, 2021 / 12:17 PM IST

nimmagadda ramesh kumar retirement: ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 31న నేను రిటైర్ అవుతున్నా అని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే అధికారులు నాకు ఇచ్చే గిఫ్ట్ అని ఆయన అన్నారు.

శ్రీవారి దర్శనం కోసం ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కూమార్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతికి వస్తే సోంత ఊరికి వచ్చినంతా ఆనందం ఉందని ఆయన అన్నారు. ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్ళి రివ్వూ చేస్తానన్న ఆయన కరోనా కేసులు జిల్లాలో చాలా తగ్గాయని అన్నారు. తిరుపతి పర్యాటక కేంద్రం కావడం వల్ల… కొద్దిగా కేసులు ఉన్నాయన్నారు. ఇప్పుడు సరైన వాతావరణం ఉంది కాబట్టే ఎన్నికలకు వెళ్లామని వివరించారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆయన మరికొన్ని రోజుల్లో తమిళనాడు సహా మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరుగుతాయని చప్పారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం సహకరించాలని సుప్రీంకోర్టు సూచించిందని నిమ్మగడ్డ అన్నారు. ప్రజలకు ఎన్నికలంటే భయం ఉండకూడదని, స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితిని వారికి కల్పించాలని ఆయన కోరారు. చిత్తూరులో గత ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల ఘర్షణలు జరిగాయని అన్నారు. గతంలో చిత్తూరులో జరిగిన ఏకగ్రీవాలపై గుడ్డిగా నిర్ణయం తీసుకోమన్న ఆయన, బాగా పరిశోధన చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నా 40ఏళ్ళ కాలంలో ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుడిని ఒక్క మాట అనలేదని నిమ్మగడ్డ అన్నారు. తప్పు చేస్తే భయపడాలి కానీ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు.