వికేంద్రీకరణ జరగకపోతే మరో వేర్పాటు ఉద్యమం రెడీ : తమ్మినేని

ఉభయ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి 23 ఇనిస్టిట్యూషన్స్ వచ్చాయని వాటిలో ఏఒక్కటి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు రాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఏపీ శాసనసభలో ఈ రోజు రాజధాని అమరావతి పై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ… అమరావతి ప్రాంతం కేంద్ర బిందువుగా రోడ్డు, రైలు, విమాన, రవాణా మార్గాలతో కనెక్టివిటీ అయి ఉన్నది అనే మాటకు ఒప్పుకుంటాను… కానీ విశాఖపట్నం కూడా అన్ని రకాల సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు.
అభివృధ్దిచెందిన అనేక దేశాల రాజధానులు పోర్టు సిటీలకు దగ్గరలో ఉన్నాయని ఆయన వివరించారు. ఈ రాజధాని నాది అనే ఫీలింగ్ తో చెపుతున్నానని…. అభివృధ్ది విషయంలో వికేంద్రీకరణ జరగకపోతే రాయలసీమ జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర సరిహద్దు జిల్లాలోంచి మరో వేర్పాటు ఉద్యమం మొదలయ్యే ప్రమాదం ఉందని స్పీకర్ హెచ్చరించారు. అభివృధ్ది ఫలాలు అందరికీ అందాలని.. క్యాపిటల్ టౌన్ నిర్మాణం అందరిదీ అని అందులో మనం ఒక్కరిగా ఉండాలి కానీ, ఇది నాది అనే ఆలోచన ఉండకూడదని సూచించారు.