అర్ధరాత్రి వైసీపీ నేతల అరెస్టు : నెల్లిమర్లలో ఉద్రిక్తత

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో ఉద్రిక్తత నెలకొంది.

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 06:58 AM IST
అర్ధరాత్రి వైసీపీ నేతల అరెస్టు : నెల్లిమర్లలో ఉద్రిక్తత

Updated On : January 25, 2019 / 6:58 AM IST

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో ఉద్రిక్తత నెలకొంది.

విజయనగరం : జిల్లాలోని నెల్లిమర్లలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న కుమిలి గ్రామంలో ఓటర్ల లిస్టులతో సర్వే చేస్తున్న వ్యక్తులను వైసీపీ నేతలు పోలీసులకు పట్టించారు. పట్టుబడ్డ వ్యక్తుల నుంచి ట్యాబ్ లు లాక్కున్నారంటూ అర్ధరాత్రి వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

బొత్స సత్యనారాయణ మేనల్లుడు, వైసీపీ జిల్లా రాజకీయ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అరెస్టు చేశారు. వైసీపీ నేతల అరెస్టుతో జిల్లాలో ఆందోళనక పరిస్థితి నెలకొంది. మజ్జి శ్రీనివాసరావును అరెస్టు చేసి, జామి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పీఎస్ వద్దకు భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. మజ్జి శ్రీనివాసరావును విడిపించేందుకు వచ్చిన ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.