Maharashtra: యూసీసీ ప్రచారం నుంచి ఒక్కసారిగా జిమ్‭కు వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన ఏం చేశారో వీడియో చూశారా?

యూసీసీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ప్రచారం చేస్తున్న ఆయన తన ప్రయాణాన్ని ఒక్కసారిగా జిమ్ వైపుకు మరల్చారు. ఈ వీడియోను ఎంఐఎం నేత ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Maharashtra: యూసీసీ ప్రచారం నుంచి ఒక్కసారిగా జిమ్‭కు వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన ఏం చేశారో వీడియో చూశారా?

Asaduddin Owaisi

Updated On : July 12, 2023 / 7:37 PM IST

Asaduddin Owaisi: ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చట్ట సభల్లో అయినా, బహిరం సభల్లో అయినా ముస్లింల తరపున బలంగా గొంతు వినిపించే నాయకుడు. దేశంలో మైనారిటీలకు ఎక్కడ ఏం జరిగినా వెంటనే అక్కడ ప్రత్యక్షమైతుంటారు. రాజకీయంగా విమర్శ, ప్రతివిమర్శల సంగతి పక్కన పెడితే, ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకుల్లో ఓవైసీ ఒకరు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉమ్మడి పౌరస్మృతిపై వ్యతిరేక ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు.


అలాంటిది ఉన్నట్టుండి ఆయన ప్రయాణాన్ని ఒక్కసారిగా జిమ్ వైపుకు మరల్చారు. బరువులు మోస్తూ.. తల భారాన్ని తగ్గించుకున్నారు. యూసీసీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ప్రచారం చేస్తున్న ఆయన.. బుధవారం అదే నగరంలోని ఒక జిమ్‭కు వెళ్లి కాస్త బరువులు మోశారు. ఈ వీడియోను ఎంఐఎం నేత ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘ఫిట్‭నెస్ రాజకీయం కాదు. ఎంఐఎం చీఫ్ & హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, #UCCకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, కొంత సమయం తీసుకుంటూ, #మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జిమ్‌కి వెళ్లాడు’’ అని ట్వీట్ చేశారు.