మహిళా అధికారిణికి బెదిరింపుల కేసు : వైసీపీ ఎమ్మెల్యేకి బెయిల్
వెంకటాపురం ఎంపీడీవో సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. నెల్లూరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చింది.

వెంకటాపురం ఎంపీడీవో సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. నెల్లూరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చింది.
వెంకటాపురం ఎంపీడీవో సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. నెల్లూరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చింది. MPDO ఫిర్యాదుతో ఆయనను ఆదివారం(అక్టోబర్ 6,2019) తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఆనంతరం కోటంరెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు అతని అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై ఐపీసీ 448, 427, 290, 506 రెడ్‌విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
తన ఇంటిపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారని వెంకటాపురం ఎంపీడీవో సరళ ఆరోపించడంతో కలకలం రేపింది. గొలగమూడి దగ్గర ఉన్న ఓ లేఅవుట్‌కు నీటి కనెక్షన్ మంజూరు చేయలేదన్న కోపంతో… తనను దుర్భాషలాడారని సరళ వాపోయారు. తన ఇంటి విద్యుత్, కేబుల్ కనెక్షన్లను తొలగించారని…. నీటి పైపులను తీసివేసేందుకు గుంతలను తవ్వించారని సరళ అంటున్నారు. కోటంరెడ్డి దౌర్జన్యంపై సరళ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో… ఆయనపై కేసు నమోదు చేశారు.
ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యం చేసినట్లు వచ్చిన ఆరోపణలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఖండించారు. లేఅవుట్‌కు వాటర్ కనెక్షన్ గురించి మాత్రమే ఎంపీడీవోను ప్రశ్నించాను అన్నారు. ఆమెని దుర్భాషలాడలేదని చెప్పారు. నేను ఎలాంటి తప్పు, దౌర్జన్యం చేయలేదన్నారు. బెదిరింపులకు పాల్పడ లేదన్నారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. తాను తప్పు చేసినట్టు విచారణలో తేలితే వైసీపీ నుంచి బహిష్కరించాలన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని కోటంరెడ్డి చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై సీఎం జగన్ కూడా ఆరా తీశారు. తప్పు చేసినట్టు ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.