హుజూర్ నగర్ బైపోల్ : టీడీపీ, బీజేపీలకు గట్టి షాక్.. ఇండిపెండెంట్ అభ్యర్థి నయం
తెలంగాణ రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. ప్రతీ రౌండ్‌లోనూ స్పష్టమైన మెజార్టీని సాధించింది గులాబీ

తెలంగాణ రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. ప్రతీ రౌండ్‌లోనూ స్పష్టమైన మెజార్టీని సాధించింది గులాబీ
తెలంగాణ రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. ప్రతీ రౌండ్‌లోనూ స్పష్టమైన మెజార్టీని సాధించింది గులాబీ పార్టీ. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ జెండా పాతింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి రికార్డ్ మెజార్టీతో గెలుపు నమోదు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. హుజూర్‌నగర్‌లో గులాబీ శ్రేణులు ఆనందోత్సాహల్లో మునిగిపోయారు.
43వేల 233 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందారు. అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం చూపారు. ఇప్పటివరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో మెజార్టీ 29వేల 194. ఆ రికార్డ్ ఇప్పుడు చెరిగిపోయింది. 15వ రౌండ్ లోనే పాత రికార్డ్ ను సైదిరెడ్డి అధిగమించారు. 2లక్షల 754 ఓట్లలో 50శాతానికిపైగా ఓట్లు సాధించి రికార్డ్ నెలకొల్పారు సైదిరెడ్డి. ఈ గెలుపుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రికార్డ్ ను సైదిరెడ్డి బ్రేక్ చేశారు. సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకుంది.
ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. కాగా ఇండిపెండెంట్ అభ్యర్థి సుమన్ మూడో స్థానంలో నిలవడం విశేషం. టీడీపీ, బీజేపీలకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రెండు పార్టీల అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. మరోవైపు హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ఎలాంటి ప్రభావం చూపలేదు.
సైదిరెడ్డికి 89వేల 459 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 55వేల 227 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామారావు కేవలం వెయ్యి 779 ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థి కిరణ్మయికి కేవలం వెయ్యి 440 ఓట్లు వచ్చాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం నింపింది.