పారాసిటమాల్ వేస్తే కరోనా తగ్గిపోతుందా? అసలు జగన్‌కు జ్ఞానం ఉందా?

  • Published By: veegamteam ,Published On : March 15, 2020 / 12:13 PM IST
పారాసిటమాల్ వేస్తే కరోనా తగ్గిపోతుందా? అసలు జగన్‌కు జ్ఞానం ఉందా?

Updated On : March 15, 2020 / 12:13 PM IST

ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సీఎం జగన్ అనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కరోనా గురించి సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. పారాసిటమాల్ వేస్తే కరోనా తగ్గిపోతుందని సీఎం జగన్ అనడం దారుణం అన్నారు. కనీస జ్ఞానం లేకుండా కరోనాపై జగన్ మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం జగన్ కు విషయ పరిజ్ఞానం లేకపోవడం దురదృష్టకరమని చంద్రబాబు వాపోయారు. 

ఒక్కరికి కరోనా ఉంటే పోలింగ్ లో పాల్గొన్న వారందరికీ వస్తుంది:
కరోనాపై మాట్లాడిన మాటలను జగన్ వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా నిరంతరం వస్తుందనే మాటలు సరికాదన్నారు చంద్రబాబు. కరోనా అనేది ఏ ఒక్కరికో వచ్చి తగ్గిపోయేది కాదన్నారు. కరోనా అనేది ఒకర్నుంచి మరొకరికి వస్తుందనేది జగన్ తెలుసుకోవాలని చంద్రబాబు అన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఏ విధమైన అవగాహన లేకుండా జగన్ ఎన్నికలకు వెళ్లారని చంద్రబాబు మండిపడ్డారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిలో ఒక్కరికి కరోనా ఉన్నా పోలింగ్ కు వచ్చిన వారందరికి కరోనా సోకుతుందని చంద్రబాబు హెచ్చరించారు. మాట్లాడితే 151 సీట్లు వచ్చాయని జగన్ చెప్పుకోవడం కరెక్ట్ కాదన్నారు. సామాజిక వర్గం పేరు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సరికాదన్నారు చంద్రబాబు. మీరు ఈసీని బెదిరిస్తారా? అని చంద్రబాబు సీరియస్ అయ్యారు. జగన్ పులివెందుల మార్క్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. అరాచకాలు చేస్తూ చిన్న గొడవలు జరిగాయని చెప్పుకుంటున్నారని ఆగ్రహించారు.

జగన్ కు ప్రజల ప్రాణాలకంటే రాజకీయాలే ముఖ్యం:
ప్రజల ప్రాణాలకంటే మీకు ఎన్నికలు ముఖ్యమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మీకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? అని జగన్ ను అడిగారు. కరోనా వైరస్ పై ముఖ్యమంత్రిగా మొదటి మీడియా సమావేశం నిర్వహించి జగన్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. కరోనా గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు.

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది:
కరోనా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోందని చంద్రబాబు చెప్పారు. కరోనాను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 5వేల 500మంది కరోనాతో చనిపోయారని చంద్రబాబు చెప్పారు. కరోనాకు మందు కూడా లేదన్నారు. కరోనా ప్రబలితే ఆసుపత్రులు లేవు, మందులూ లేవన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే, కరోనా వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, 60ఏళ్లు పైబడిన వారికే కరోనా వస్తుందని, పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని సీఎం జగన్ అనడం దారుణం అని చంద్రబాబు అన్నారు. జగన్ తెలివి తక్కువ తనానికి ఇదే నిదర్శనం అన్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు జగన్ లేదన్నారు చంద్రబాబు.

కరోనాపై చంద్రబాబు కామెంట్స్:
* కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది
* భారత్ లో కరోనా ప్రబలితే ఊహించడం కష్టం
* కరోనా 147 దేశాలను వణికిస్తోంది
* కరోనా కట్టడికి ప్రధాని మోడీ సైతం సార్క్ దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తో 5వేల 550 మంది చనిపోయారు
* మన దేశంలో కరోనాతో ఇద్దరు చనిపోయారు

* కరోనా గ్లోబల్ వైరస్ గా తయారైంది
* మన దేశంలో 12 రాష్ట్రాల్లో కరోనా బాధితులు ఉన్నారు
* ఇప్పటివరకు మన దేశంలో 107 మందికి కరోనా వచ్చింది
* ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వల్ల ప్రమాదం లేదంటారా?
* కరోనాను అత్యంత ప్రమాదకారి వైరస్ గా డబ్ల్యూహెచ్ వో గుర్తించింది
* కరోనాను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది

* 60 ఏళ్ల వయసున్న వారికే కరోనా వస్తుందని జగన్ మాట్లాడటం బాధాకరం
* కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా వచ్చింది
* కరోనా ప్రబలితే ఆసుపత్రులు లేవు, మందులు కూడా లేవు
* కరోనాపై సీఎం జగన్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు
* ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే హక్కు జగన్ కు లేదు
* పారాసిటమాల్ వేస్తే తగ్గుతుందంటున్నారు
* వీరికి కనీస నాలెడ్జ్ కూడా లేదు

* కరోనాపై జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా
* ఏ విధంగా వెళ్లి ఓట్లు అడుగుతారు
* కరోనా వైరస్ కు మందు లేదు
* ఒక్కరికి కరోనా ఉంటే పోలింగ్ లో పాల్గొన్న వారందరికీ వస్తుంది
* జగన్ కు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదు
* జగన్ కు వీడియో గేమ్స్ పై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉందా?
* చైనా వెలుపల కరోనా వైరస్ 13 రెట్లు ప్రబలింది
* 70శాతం ప్రజలకు కరోనా సోకుతుందని జర్మన్ ప్రతినిధులు చెప్పారు
* కరోనాపై పోరుకు అమెరికా 3లక్షల 50వేల కోట్లు ఖర్చు చేస్తోంది
* కరోనా వేగంగా వ్యాపిస్తే.. రాష్ట్రం ఏమవుతుంది?
* జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో అవగాహన లేక జగన్ ఎన్నికలకు వెళ్లారు