చంద్రన్న కానుక : ఏపీలో నెల ఫించన్ రూ.2వేలు
నెల్లూరు: ఏపీలోని వృధ్దులు,వితంతువులు,ఒంటరి మహిళలు, చేనేత కార్నికులు,గీత కార్మికులు, వికలాంగులకు ప్రభుత్వం నెల,నెలా, ఇచ్చే పించనును 2వేల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో 200 ఉండే పించన్ను వెయ్యి చేశామని, అది ఇప్పుడు 2వేలు చేస్తున్నామనని నెల్లూరు జిల్లా బోగోలు లోజరిగిన జన్మభూమి కార్యక్రమంలో చెప్పారు. దీనిద్వారా రాష్ట్రంలో 54 లక్షలమంది ఫించన్ దారులకు లబ్ది చేకూరుతుంది.
పేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా ఉంటాని మాట ఇచ్చినందుకు సంక్రాంతి కానుకగా దీన్నిఅందచేస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పేద,వృధ్దులను, వితంతువులను, ఒంటరి మహిళల బాధలను చూశానని వారి సంక్షేమం కోసం పించను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. పేదలకు ఇప్పటివరకు వైద్యసాయానికి అందిస్తున్న 2లక్షలరూపాయలను వచ్చే నెలనుంచి 5లక్షలు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.