కరీంనగర్‌ బీజేపీలో వర్గ విభేదాలు

కరీంనగర్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ సాక్షిగా వర్గ విభేదాలు బయపటపడ్డాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 02:27 AM IST
కరీంనగర్‌ బీజేపీలో వర్గ విభేదాలు

Updated On : April 5, 2019 / 2:27 AM IST

కరీంనగర్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ సాక్షిగా వర్గ విభేదాలు బయపటపడ్డాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది.

కరీంనగర్ : కరీంనగర్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ సాక్షిగా వర్గ విభేదాలు బయపటపడ్డాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన చివరి నిముషంలో రద్దైంది. ఇంతకీ అమిత్‌షా కరీంనగర్‌ బహిరంగ సభకు ఎందుకు హాజరు కాలేదు? అసలేం జరిగింది? అత్యవసర సమావేశాలు ఉండటం వల్లే అమిత్‌షా రాలేకపోయారా? అయితే అమిత్‌షా రాకపోవడం వెనుక కరీంనగర్‌ బీజేపీ కార్యకర్తల్లో మాత్రం కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.

కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఓవైపు బీజేపీ పార్టీ ఉరకలు వేస్తోంటే… కరీంనగర్‌లో మాత్రం ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న వర్గ విభేదాలు పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. ఫలితంగా పోటీలో నిలిచిన అభ్యర్థికి పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో  రెండో స్థానంలో నిలిచి… అధికారపార్టీకి గట్టి పోటీనిచ్చిన బండి సంజయ్‌కి పార్టీ శ్రేణుల సంపూర్ణ మద్దతు కరువవుతోంది. దీంతో కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించాలంటేనే కాషాయ నేతలు జంకుతున్నారన్న ప్రచారం సాగుతోంది.  దీనికి ఓ కారణం ఉంది. గతంలో నిర్వహించిన సభలన్నీ ప్లాఫ్‌ అవ్వడంతో… ఇక్కడ సభలు నిర్వహించి .. ఫ్లాప్‌ అయ్యాయని చెప్పించుకోవడం ఎందుకనే భావనలో బీజేపీ నేతలున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి మంచి పట్టుండేది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ కరీంనగర్ ఎంపిగా గతంలో ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ ఉన్న గ్రూపు రాజకీయలతో గెలిచే స్థానంలో సైతం బీజేపీ ఓటమి పాలవుతుంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసిన బండి సంజయ్ పార్టీలోని రాష్ట్ర, జాతీయ నేతలతో పోసగక పోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారు. రంగంలోకి దిగిన భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ పెద్దలు బీజేపీ నేతలతో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చేశారు కానీ.. పరిష్కారం చూపించలేక పోయారు. ఫలితంగా బీజేపీలో వర్గ విబేధాలు కోనసాగుతునే ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన బండి సంజయ్‌కి పార్లమెంట్‌ టిక్కెట్ కేటాయించడం పార్టీలోని చాలా మందికి అస్సలు ఇష్టం లేదనేది ఆయన అనుచరుల వాదన. అసెంబ్లీ ఎన్నికల్లో రెండోస్థానంలో నిలవడంతో … పార్లమెంట్ టిక్కెట్‌ను అధిష్టానం కేటాయించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుతోపాటు చాలా మంది నేతలు కరీంనగర్‌ నుంచి పోటీచేయడానికి ప్రయత్నాలు చేశారు. వారిని కాదని సంజయ్‌కు     టిక్కెట్‌ కేటాయించడంతో ఓ వర్గం నేతలంతా సంజయ్‌పై గుర్రుగా కున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో నిర్వహించాలని నిర్ణయించిన సభకు అమిత్‌షాను పిలిచారు. ఎంపీ అభ్యర్థి సంజయ్‌ సభను సక్సెస్‌ చేసేందుకు జనాన్ని భారీగా తరలించారు. కొంతమంది నేతలు మాత్రం అధిష్టానానికి జనాలు పెద్దగా రాలేదని చెప్పడంతో అమిత్‌షా హాజరుకాలేదన్నది కొంతమంది వాదన. దీంతో అమిత్‌షా లేకుండానే సభ ముగిసింది. మొత్తానికి అమిత్‌షా రాకపోవడానికి పార్టీలోని వర్గవిభేదాలే కారణంగా తెలుస్తోంది.